వైఎస్ అభిషేక్ రెడ్డి అనే వైఎస్ కుటుంబసభ్యుడు కోమాలో ఉన్నారు. మామూలుగా అయితే కామనే అనుకోవచ్చు కానీ కుటుంబం అంతా హైదరాబాద్ లో ఉంటే జగన్ మాత్రం పట్టించుకోలేదట. జగన్ ఆయన సతీమణి భారతి మాత్రం అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి లేదా ఆ రెడ్డి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి కూడా వెళ్లలేదు.ఈ విషయాన్ని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు.
ఈ అభిషేక్ రెడ్డి పేరు గతంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పులివెందలలో జగన్ తరపున వ్వవహారాలు ఆయనే చక్క బెడతారని అంటార. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినప్పుడు .. పార్టీ తరపున అభిషేక్ రెడ్డినే రెడీ చేసినట్లుగానే చెబుతున్నారు. అయితే అవినాష్ అరెస్టు కాలేదు. అభిషేక్ రెడ్డికి అవకాశం రాలేదు. అయన వయసు 35 ఏళ్లలోపే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఏమయిందో కానీ ఆయన చావుబతుకుల్లో ఉన్నారని చెబుతున్నారు.
వైఎస్ అభిషేక్ రెడ్డి స్వయంగా డాక్టర్. ఆయనకు ఉన్న అనారోగ్యం గురించి బయటకు తెలియడం లేదు. అయితే ఆయన కోమాలో ఉన్నారని అంటున్నారు. జగన్ కోసం పని చేసిన కుటుంబసభ్యుడ్ని ..జగన్ పట్టించుకోలేదని.. కానీ ఓ నేరస్తుడ్ని పరామర్శించడానికి మాత్రం జైలుకెళ్లారని టీడీపీ నేతలంటున్నారు.