చంద్రబాబు అవినీతి చేశారంటూ ఐఎంజీ భరత భూముల కేసుల్లో కింద 30 అవినీతి కేసులు పెట్టుకున్న విజయసాయిరెడ్డి వంటి వాళ్లు వేసిన పిటిషన్ ను కనీస ఆధారాలు కూడా లేవని తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. నిజానికి ఐఎంజీతో పాటు చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేస్తూ వేసిన పిటిషన్లను కోర్టులు ఎన్ని సార్లు కొట్టేశాయో లెక్కలేదు. అయినా ఆ విషయాలను దాచి పెట్టి మళ్లీ మళ్లీ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా కనీస ఆధారాలూ చూపించలేకపోతన్నారు. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇప్పిస్తున్నారు.
చిన్న తప్పు పట్టుకోలేకపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి
చంద్రబాబు పదేళ్లు సీఎంగా ఉన్న తర్వాత ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టుల్లో ఉన్న పిటిషన్లకు లెక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేయించని విచారణ లేదు. కేబినెట్ సబ్ కమిటీలు, అసెంబ్లీ కమిటీలకు లెక్కలేదు. వారు చంద్రబాబు పదేళ్ల పాలనను నఖశిఖ పర్యంతం పరిశీలించినా అసలు ఒక్కతప్పునూ పట్టుకోలేకపోయారు. ఒక్క కేసునూ పెట్లలేకపోయారు. అప్పుడే చంద్రబాబు క్లీన్ ఇమేజ్ ను వైఎస్ గట్టిగా చూపించారు.
తప్పుడు పిటిషన్ల వేసి స్టేలంటూ సత్య ప్రచారాలు
అయితే చంద్రబాబుపై తప్పుడు పిటిషన్లు వేసి ఆయనపై బురత చల్లే ప్రయత్నాలను మాత్రంమ ఎప్పుడూ మానుకోలేదు. పైగా స్టేలు తెచ్చుకున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేసేవారు. ఆ ప్రచారాలు పీక్ స్టేజ్ లో జరిగేవి. నిజం ఏమిటంటే.. చంద్రబాబుపై ఎప్పుడూ కే్సులు పెండింగ్ లేవు. స్టేల మీద అసలు లేనేలేవు. విచారణ జరిగితే కొట్టివేశారు. లేకపోతే పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికి ఏ కేసులోనూ ఆధారాలు చూపించలేకపోయారు.
ఒక్క రూపాయి అవినీతిని చూపించలేక తప్పుడు కేసులు పెట్టిన జగన్
జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత క్క రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారు. ఫలానారూపాయి ఆయనకు అలంచంగా వచ్చిందని ఒక్క రూపాయికి సాక్ష్యాలను కోర్టు ముందుంచలేకపోయారు. అయినా తన చేతిలో అధికారం ఉంది కాబట్టి సగం సమాచారం దాచి పెట్టి సగం తప్పుడు సమాచారం ప్రచారం చేసి.. కేసులు పెట్టి జైల్లో వేశారు. బెయిల్ ఇచ్చేటప్పుడే కోర్టు కనీస ఆధారాలు లేవని స్పష్టం చేసింది ఈ కేసుల్లో నిజానిజాలు త్వరలోనే తేలనున్నాయి.
చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవర్నీ తప్పుడు కేసుల్లో ఇరికించలేదు. తప్పు చేసిన వారిని రాజకీయ కక్ష సాధింపులు అని అంటారేమో అని వదేలిసి ఉంటారు. కానీ చంద్రబాబును మాత్రం రాజకీయ ప్రత్యర్థులు వెంటాడారు. కానీ అవి చంద్రబాబు కడిగిన ముత్యం అని నిరూపించడానికే ఉపయోగపడ్డాయి.