పోలీసు వ్యవస్థ ఎంతో గొప్పది. కానీ ఆ వ్యవస్థను నడిపించేవారు మూర్ఖులు, స్వార్థపరులు, వ్యవస్థను నాశనం చేసే వారు అయితే.. మొత్తం పోలీసులకే చెడ్డపేరు వస్తుంది. గతంలో ఏపీ పోలీసులు అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. సమర్థతకు మారుపేరుగా ఉండేది. కానీ వైసీపీ హయాంలో జగన్ అనే 30 కిపైగా తీవ్రమైన కేసులున్న క్రిమినల్ చేతుల్లో పడిన వ్యవస్థ మాఫియాగా మారిపోయింది. దీంతో ప్రజల్లో విశ్వసం కోల్పోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ చట్టంపై.. పోలీసులపై ప్రజల్లో మెల్లగా నమ్మకం పెరుగుతోంది.
విజయవాడ వరదల్లో పోలీసు సేవలు సూపర్
విజయవాడ వరదల్లో పోలీసులు అందించిన సేవల్ని ఏ మాత్రం తక్కువ చేయలేం. కెలామిటీస్ వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ ఎంత సమర్థంగా పని చేస్తే ప్రజా జీవనం అంత త్వరగా గాడిన పడుతుంది. వరదల్లో ఇరుక్కున్న వారిని కాపాడటం దగ్గర నుంచి అందరికీ నిత్యావసర వస్తువులు పంచేంత వరకూ ఎలాంటి సమస్యలు రాకుండా చూసే విషయంలో సమర్థంగా పని చేశారు. ఐదేళ్ల కాలంలో వీిపై ఏర్పడిన నెగెటివ్ భావన.. వరదల్లో వారు చేసిన సాయంతో పోయేలా … పని చేశారు. ప్రజల్లోనూ పోలీసు సేవలపై సంతృప్తి కనిపించింది.
నడిపించేవారిలోనే అసలు లోపం – డిపార్టుమెంట్ సిన్సియర్
నిజానికి డీఎస్పీలు అయినా సరే పై వాళ్లు చెప్పినట్లే చేయాలి. పై వాళ్లను రాజకీయ నేతల్ని మెప్పించేందుకు అతి చేసే కొందరు మినహా.. మిగతా డిపార్టుమెంట్ మొత్తం.. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే పని చేస్తుంది. వారు దారి తప్పితే.. మొత్తం డిపార్టుమెంట్ కు చెడ్డపేరు వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఇలా ఓ పదిహేను మంది దారి తప్పిన అధికారుల వల్ల మొత్తం వ్యవస్థపై మాఫియా అనే ముద్రపడిపోయింది. జత్వానీ కేసు దానికి ఉదారణ. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చెప్పడం కష్టం.
వ్యవస్థపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం
వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా చేసేలా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు డిపార్టుమెంట్ పనిచేస్తోంది. అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు కూడా ఇష్టం లేని వారిని వైసీపీ తరహాలో బొక్కలో వేసి కుమ్మేద్దామని అనుకోవడం లేదు. తప్పు చేస్తే చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే.. శాంతిభద్రతల విషయంలో రాజీ పడటం లేదు. గంజాయితో పాటు ఇతర అసాంఘిక శక్తుల అంతు చూస్తున్నారు. మొత్తంగా పోలీసు వ్యవస్థను వాడుకున్న దాన్ని బట్టే…దేవుడా.. దెయ్యమా అనేది తేలుతుంది. ఇప్పుడు వారు దేవుళ్లుగా మారేందుకు అవకాశాలు దక్కించుకుంటున్నారు.