తాను వస్తే అందర్నీ జైలుకు పంపుతానని గుంటూరుజిల్లా జైలు ముందు జగన్ హెచ్చరించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎవర్ని జైలుకు పంపలేదు ?. కనీస ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టి జైలుకు పంపారు. కింది స్థాయి టీడీపీ కార్యకర్త నుంచి చంద్రబాబు వరకూ అందర్నీ జైలుకు పంపారు. ఒక్కరిపైన అయినా ఆధారాలు ఉన్నాయా అంటే లేనే లేవు. ఐదేళ్ల పాటు చేసిన అరాచకపాలనతో… అధికారం పోయిన తర్వాత తమ వాళ్లకూ జగన్ సమస్యగా మారారు.
ఇప్పుడు జైలుకు పోయే ప్రతి ఒక్క వైసీపీ నేత , కార్యకర్త పాపం జగన్ దే. అధికారం ఉంది ప్రతిపక్ష నేతలపై దాడులు, హత్యలు చేయడానికే అన్నట్లుగా వ్యవహరించారు. తనను తిట్టారని.. దాడులకు ప్రోత్సహించారు. అవినీతికి అడ్డు అదుపూ లేకుండా చేశారు. ఆ తప్పిదాలు.. దోపిడీలు.. దొంగతనాలు చేసి.. ఎంత కాలమైనా హాయిగా ఉందామనుకుంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. జైలుకు పోతున్నారు.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారో రారో కానీ.. తప్పుడు పనులకు మాత్రం.. శిక్ష అనుభవిస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. లఆయన తనతో పాటు .తన ఈగో కోసం అందర్నీ జైలుకు పంపుతున్నారు. పంపుతోంది టీడీపీ నేతలు మాత్రం కాదు.