జగన్మోహన్ రెడ్డి తన కష్టాల నుంచి బయటపడేందుకు, కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు అర్జంట్‌గా కుటుంబంలో వివాదాలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు. పదవిలో ఉన్నప్పుడు.. మళ్లీ గెలుస్తానని.. ఎవరి సాయం అక్కర్లేదని అనుకున్నారు. కానీ అందరూ కలిసి కర్రలు కడితేనే తాను నిలబడతానని లేకపోతే బోర్లా పడిపోతానని తెలిపోయింది. ఇప్పుడు మళ్లీ లేపడానికి ఆసరాను వెదుక్కుంటున్నారు.
అందుకే షర్మిలకు ఆయన రాయబారం పంపినట్లుగా తెలుస్తోంది. అయితే షర్మిల గతంలో కన్నా రెట్టింపు డిమాండ్లను జగన్ ముందు పెట్టిందని అంటున్నారు . ఇప్పుడు జగన్ తనకు ఆస్తులు పంచడం కన్నా… రాజకీయంగా తాను ముందుకెళ్తున్నానని కొన్నాళ్లకైనా వైఎస్ వారసురాలిని తానేనని నిరూపించుకోగలనని ఆమె నమ్మకంతో ఉన్నారు. అందుకే గతంలో పట్టించుకోని సోదరుడ్ని ఇప్పుడు ఆమె పట్టించుకోవడం మానేసింది. డిమాండ్లు డబుల్ చేసింది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో సగం వాటా ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ మొత్తం ఇచ్చేయడంతో పాటు కొన్ని వ్యాపారాల్లో వాటా కూడా ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని పులివెందులలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే షర్మిల మాత్రం… ఆలోచిస్తున్నారు. ఆమె ఇప్పుడు పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రణాళికలు వేసుకుటున్నారు. ఆస్తులు రాసిచ్చినా తాను రాజకీయంగా సైలెంట్ అయ్యే ప్రశ్నే లేదని తేల్చి చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
రాజకీయంగా ఎవరి దారి వారిదేనని … అయితే జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే అభ్యంతర పెట్టబోనని అంటున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి వైఎస్ ఫ్యామిలీలో రీకన్సిలేషన్ ప్రోగ్రాం నడుస్తోంది. కానీ జగన్ చేసిన పనుల వల్ల…కష్టంగా మారుతోందని అంటున్నారు.