వైసీపీలో పార్టీ బాధ్యతలు తీసుకునే నాయకులు లేక జగన్ రెడ్డి కిందా మీదా పడుతున్నారు. ఆయన పెట్టిన 26 జిల్లాలకు ఇరవై ఆరు మంది అధ్య.క్షుల్ని వెదకడం తలకు మించిన భారంగా మారింది. దీంతో ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షుల్ని నియమించాలని నిర్ణయించుకున్నారు. ఎవరు పార్టీలో ఉంటారు.. ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో జగన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పెడుతున్నారు.
ఆయన ఎప్పుడో కాంగ్రెస్ హయాంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇటీవలి కాలం వరకూ నెంబర్ టుగా చక్రం తిప్పారు. కానీ ఇప్పుడు ఆయనను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా మార్చేస్తున్నారు. జగన్ రెడ్డి ఈగోను శాటిస్ ఫై చేయడానికి చంద్రబాబును వ్యక్తిగత శత్రువుగా చేసుకున్న పెద్దిరెడ్డి ఎంత టార్చర్ అనుభవించాలో ఇప్పుడు అంత అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆయనను జగన్ మరింతగా ఇబ్బంది పెట్టేందుకే సిద్ధమయ్యారు. ఇక క్లీన్ స్వీప్ నుంచి తుడిచిపెట్టుకుపోయిన నెల్లూరులో ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో జగన్ నిర్ణయించలేకపోతున్నారు. వయసపోయిపోయిందని పక్కన పెట్టేసిన పదేళ్ల తర్వాత మళ్లీ మాజీ ఎంపీ మేకపాటిని మీరు రంగంలోకి దిగాల్సిందే సార్ అని జగన్ బతిమాలుకుంటున్నట్లుగా తెలుస్తోంది., ఆయనకూ ఉమ్మడి నెల్లూరు జిల్లా పదవి ఆఫర్ చేస్తున్నారు.
జగన్ రెడ్డి పార్టీలోని సీనియర్లను యాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు అనుచితంగా ప్రవర్తించి పక్కన పెట్టేయడమే కాకుండా ఇప్పుడు… కష్టాలొచ్చినప్పుడు తమ వద్దకు వచ్చి బతిమాలడం వారికి నచ్చడం లేదు ., అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకుంటారని.. రేపు తమ అవసరం లేదనుకుంటే కాళ్లు లాగేస్తారని.. దాని కోసం ఆవేశపడటం ఎందుకని సీనియర్లు కూడా భావిస్తున్నారు.