హైదరాబాద్ ఇప్పుడు అల్ట్రా లగ్జరీ ఇళ్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఇప్పటి వరకూ నిర్మాణం అమ్ముడయిన వాటిని పక్కన పెడితే.. నిర్మాణంలో ఉన్న ఇలాంటి ఇళ్లు రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఇలాంటి కొన్ని అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల గురించి ఇప్పుడు తెలుసుతుందం.
SAS క్రౌన్ రూ. 26 కోట్లు
కోకాపేటలో నిర్మాణం అవుతున్న అరవై అంతస్తు అతి పెద్ద అపార్టుమెంట్ కాంప్లెక్స్ SAS క్రౌన్. ఇందులో కొన్ని ప్లాట్ల సైజ్ 16 వేల ఎస్ఎఫ్టీ వరకూ ఉంటుంది. సాధారణంగా బిల్డర్లు నిర్మించి అపార్టుమెంట్లు వెయ్యి ఎస్ఎఫ్టీతో డబుల్ బెడ్ రూం ఉంటుంది. అలాంటిదికి పదహారు అపార్టుమెంట్ల వైశాల్యం ఉండేలా ఈ ఫ్లాట్ ఉంటుంది. దీని విలువ రూ. 26 కోట్లుగా ఉంది. ఇది అపార్టుమెంట్లో ట్రిప్లెక్స్.. స్కైవిల్లాస్లా ఉంటుంది. చూస్తే తప్ప ఆ విలాసాన్ని వర్ణించడం కష్టం.
డీఎస్ఆర్ ట్విన్స్ రూ. 23 కోట్లు
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సిద్ధమవుతున్న టవర్ డీఎస్ఆర్ ది ట్విన్స్. లగ్జరీ ఇళ్ల నిర్మాణంలో డీఎస్ఆర్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాన్ని మరింత పెంచుకునేలా ది ట్విన్స్ ను డిజైన్ చేశారు. ఇది కూడా పదహారు వేల ఎస్ఎఫ్టీతో ఉంటాయి. ఒక్కో ఇంటి వాల్యూ ఇప్పుడు 23 కోట్ల వరకూ ఉంది. వచ్చే నెల ఎంత ఉంటుందో చెప్పడం కష్టం.
డీఎస్ఆర్ ది వరల్డ్ రూ. 22 కోట్లు
డీఎస్ఆర్ ది వరల్డ్ పేరుతో మరో ప్రాజెక్టును డీఎస్ఆర్ సంస్థ జూబ్లిహిల్స్‌లో చేపట్టింది. ఇందులో ఒక్కో అపార్టుమెంట్ సైజ్ 13వేల ఎస్ఎఫ్టీ ఉటుంది. ఇందులో ఒక్కో ఫ్లాట్ ధరను రూ. 22 కోట్లుగా ఖరారు చేసి అమ్ముతున్నారు.
కాండ్యూర్ స్కైలైన్ రూ. 19 కోట్లు
కాండ్యూర్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ.. స్కైలైన్ పేరుతో మరో లగ్జరీ అపార్టుమెంట్ కాంప్లెక్స్ ను నిర్మిస్తోంది. స్కైడోమ్ టవర్ లో 11,900 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ ను సిద్ధం చేస్తోంది. ఒక్కో ఫ్లాట్ విలువ ప్రస్తుతం రూ. 19 కోట్ల వరకూ ఉంది. విదేశీ ఆర్కిటెక్టులతో డిజైన్ చేయించడంతో వరల్డ్ క్లాస్ లగ్జరీని స్కైలైన్ ఆఫర్ చేస్తోంది.
మైహోమ్ కోకాపేట రూ. 18 కోట్లు
మైహోమ్ చేపట్టిన ప్రాజెక్టుల్లో బయోడైవర్సిటీ దగ్గర ఉన్న మైహోమ్ భూజానే అతి పెద్ద లగ్జరీ అపార్టుమెంట్ ప్రాజెక్టు. ఇప్పుడు ఆ భూజాలో ఒక్కో ఫ్లాట్ కనీసం పదిహేను కోట్ల వరకూ ఉంటుంది. కానీ కట్టేటప్పుడు అంత లేదు. ఇప్పుడు కోకాపేట నియోపోలిస్ లో కొత్త ప్రాజెక్టును అత్యంత లగ్జరీగా పది వేల ఎస్ఎఫ్టీతో ఆఫర్ చేస్తోంది. ధరను పద్దెనిమది కోట్ల రూపాయల వరకూ నిర్ణయించింది.
ఇవన్నీ పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం లేని ప్రాజెక్టులు. ఎందుకంటే లగ్జరీని ఇష్టపడే సర్కిల్స్ లో ఆటోమేటిక్ గా ప్రచారం అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్వరూపం మారుతున్న వైనం తెలుసుకుని ఆహా.. ఓహో అనుకోవడం తప్ప… కొనాలంటే.. బడాబాబులైనా ఆలోచించాల్సిన ప్రాజెక్టులే.