వరద పేరిట బురద రాజకీయం చేస్తున్నారని జగన్ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆపత్కాల సమయంలోనూ రాజకీయానికి ప్రాధాన్యత ఇస్తూ..అమానవీయంగా వ్యవహరిస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విమర్శల సంగతి ఎలా ఉన్నా జగన్ మాత్రం తన రాజకీయం తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, విపక్ష నేత తరహా రాజకీయం చేయడంలోనూ జగన్ తేలిపోతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
వరద ముంపు ప్రాంతాల్లో రెండు సార్లు పర్యటించిన జగన్…ఆలస్యంగా వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో రెండు సార్లూ జగన్ కు ఇదే రకమైన అనుభవం ఎదురైంది. ఆ తర్వాత తేరుకుని వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొని బాధితుల మెప్పు పొందాల్సిన జగన్…వాటికి భిన్నంగా ఇంటికి పరిమితమై.. పరిస్ధితులు అన్నీ కుదుట పడుతున్న తరుణంలో తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల సర్కార్ సహాయక చర్యలతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి..మరో నాలుగు రోజుల్లో బాధితులకు నష్టపరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిస్థితులు అంతా చక్కబడుతున్న వేళ జగన్ పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శిస్తుండటం పట్ల..దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఆయన వైఖరి ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.