బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్కడున్నారు? బీఆర్ఎస్ నేతలంతా అరికపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి వ్యవహారంపై స్పందిస్తున్నా ఆమె ఇంకా ఎందుకు సైలెన్స్ వీడటంలేదు? సర్కార్ సమరమేనని గర్జించిన కవిత ఎందుకు ఈ విషయంపై నోరు విప్పడం లేదు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన కవిత ఇటీవలే బెయిల్ పై బయటకు వస్తూ..వస్తూ.. మొండిని జగమొండిని చేశారంటూ అగ్రెసివ్ గా జైలు బయటే రియక్ట్ అయ్యారు. బీజేపీని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలను చేసినా..కాంగ్రెస్ విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓ పదిరోజులు తనను కలవడానికి ఎవరూ రాకండి అని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్ళిపోయింది. అనంతరం కవిత తన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
కవిత చెప్పిన పదిరోజులు ముగిశాయి.. అయినా ఆమె మాత్రం ఇంతవరకు ఏ రాజకీయ అంశంపై స్పందించలేదు.. సరికదా తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అగ్గి రాజేసిన కౌశిక్ రెడ్డి – అరికపూడి గాంధీ వివాదంపై ఇప్పటికీ నోరు విప్పలేదు.
అమెరికాలో ఉన్న ఆమె సోదరుడు కేటీఆర్ అక్కడి నుంచి రోజూ సర్కార్ పై ట్వీట్స్ ద్వారా దాడి చేస్తూనే ఉన్నారు. కానీ, సర్కార్ పై సమరమేనని భీకర ప్రకటనలు చేసిన కవిత ఇంత పెద్ద వివాదం జరుగుతున్నా కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించకపోవడానికి కారణం ఏంటి? కేసీఆర్ సూచనతోనే సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నారా? అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.