అబ్బే ఇది ఎమ్మెల్యే గాంధీ చేసినదాడి కాదు.. రేవంత్ రెడ్డి చేయించిందే. కౌశిక్ రెడ్డి ఆంధ్రా వాళ్లను ఏమీ అనలేదు.. గతంలో రేవంత్ రెడ్డే చినజీయర్ ను , ఆనంద్ సాయి ఆంధ్రా వాళ్లని కించ పరిచాడు.. అంటూ హరీష్ రావు డ్యామేజ్ కంట్రోల్ కామెంట్లు ప్రారంభించారు. నిన్న పోలీస్ స్టేషన్ లో జరిగిన తోపులాటలో గాయం అయిందని కౌశిక్ రెడ్డి ఇంట్లో హౌస్ అరెస్టు నుంచి ఆస్పత్రికి వెళ్లి.. తర్వాత కోకాపేటలోని తన విల్లాకు చేరుకున్న తర్వాత హరీష్ మీడియాతో మాట్లాడారు.
ఆ ప్రెస్ మీట్ మొత్తం ఎక్కడా ఆంధ్రావాళ్లు, సెటిలర్లు మీదకు ఇంకా చెప్పాలంటే..ఎమ్మెల్యే గాంధీ మీదకు కూడా ఒక్క మాట పోకుండా పూర్తిగా రేవంత్ ను టార్గెట్ చేశారు. సమస్య వచ్చిన ప్రతి సారి రేవంత్ కొత్త ట్రాప్ వేస్తున్నారని .. డైవర్షన్ చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు రేవంత్ డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని ముందే ఊహించుకుంటే ఆయన కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందంటూ.. సిద్దపేట నుంచి వచ్చేసి.. సినిమాలో తాను బాగమయ్యే వారు కాదు. కానీ రేవంత్ ట్రాప్ లో వ్యూహత్మకంగా బీఆర్ఎస్ చిక్కింది. అందులో హరీష్ భాగమయ్యారు.
కౌశిక్ రెడ్డి ఆంధ్రా వాళ్లపై చేసిన వ్యాఖ్యలు వాటిని పట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన హంగామా చూసి మరింతగా ఆంధ్రా వాళ్లంటూ .. దూషణలు చేశారు. కానీ ఈ వివాదాన్ని రేవంత్ రెడ్డి పక్కాగా ఉపయోగిచుకున్నారు. నిజంగా ఆయన ట్రాప్ వేశారో.. కౌశిక్ రెడ్డి అతి రాజకీయంతో చాన్స్ ఇచ్చారో బిఆర్ఎస్ నేతలకే తెలియాలి. ఇప్పుడు ఆంధ్రా వాళ్లకు తాము వ్యతిరేకం కాదని.. చెప్పుకునందుకు హరీష్ రావు తంటాలు పడుతున్నారు. తనకు రావాల్సిన పదవిని తీసుకున్న గాంధీని కూడా ఆయన ఒక్క మాట అనలేకపోతున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.