జాతకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే వేణు స్వామిపై కేసు పెట్టాలని హైదరాబాద్ పదిహేడో మెట్రోలిపాలిటక్ కోర్టు జూబ్లిహిల్స్ పోలీసులను ఆదేశించింది. వేణు స్వామి మహా మోసగాడు అని ఆరోపిస్తూ.. టీవీ5 మూర్తి కోర్టుకెళ్లారు. ఆయనపై కేసు పెట్టి విచారణ జరిపేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపిన కోర్టు మూర్తి వేసిన పిటిషన్ లో మెరిట్ ఉందని గ్రహించి కేసు పెట్టాలని జూబ్లిహిల్స్ పోలీసుల్ని ఆదేశించింది.
నాగచైతన్య, శోభిత ఎంగేజ్ మెంట్ పై పిచ్చి జోస్యం చెప్పి అందరితో తిట్లు తిన్న వేణు స్వామి.. చివరికి మూర్తి నిర్వహించిన ఓ డిబేట్ ద్వారా పూర్తిగా ఎక్స్ పోజ్ అయ్యారు. ఆయన నగ్నపూజల దగ్గర్నుంచి మోసాల్నీ బయటపడ్డాయి. దాంతో మూర్తి తనను ఐదు కోట్లకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తన భార్యతో సహా వీడియో చేశారు. అప్పట్నుంచి తాను డబ్బుల డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు బయట పెట్టాలని .. మూర్తి వెంట బడుతూనే ఉన్నారు. వేణు స్వామి రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తున్నారు.
చివరికి కేసు పెట్టేలా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చారు. నిజానికి మూర్తిని బ్లాక్ మెయిల్ చేయడానికి వేణు స్వామినే ఓ ఆడియో రికార్డు చేయించారు. అది కూడా బయటపడింది. ఇప్పుడు వేణు స్వామిపై పోలీసులు కేసు పెట్టి.. విచారణ జరిపి.. అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆయన బాధితులు ముందుకు వస్తే.. చాలా కాలం పాటు జైల్లోనే మగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.