ప్రతి పార్టీకి ఓ ట్రబుల్ షూటర్ ఉంటారు. పార్టీలో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఆ ట్రబుల్ షూటర్ చేసే ప్రయత్నాలు పార్టీని చాలా వరకూ గాడిలో పెడతాయి. వైసీపీలో ఇప్పుడా ట్రబుల్ షూటర్ పదవి మాజీ మంత్రి విడదల రజనీకి వచ్చింది. ఎవరు అసంతృప్తికి గురైనా చర్చల కోసం వైసీపీ పెద్దలు విడదల రజనీని పంపుతున్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ రెడ్డి బంధువు. ఆయన పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. జగన్ తో కూడా సమావేశం అయ్యారు. ఆ తర్వాత అ ప్రచారం తగ్గకపోగా.. మరింత పెరిగింది. హైదరాబాద్ లో అనుచరులతో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం అయ్యారని తెలియగానే పార్టీ తరపున విడదల రజనీ చర్చలకు వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తో చర్చలు జరిపారు. ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధి ఆమె ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకుండా వెళ్లిపోయారు.
ఇక ముందు విడుదల రజనీ వైసీపీలో ఈ ట్రబుల్ షూటర్ గా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. బంధువైన బాలినేని జగన్ నచ్చ చెబితే వినకపోతే… విడదల రజనీ చెబితే వింటారా అన్న డౌట్ ఎవరికైనా రావొచ్చు.. చెప్పే పద్దతిలో చెబితే వింటారు. అందుకే ట్రబుల్ షూటర్ అంటారని అనుకోవచ్చు. రజనీకి ఇలాంటి తెలివితేటలు ఉన్నాయని గుర్తించి జగన్ కీలక బాధ్యతలు ఇచ్చారని అంటున్నారు.