ముంబై నటి జెత్వానీ పట్టుదలగా తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నారు. తనను.. తన కుటుంబాన్ని వేధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విజయవాడ పోలీసుల వద్దకు వస్తున్నారు. వారికి కావాల్సిన సమాచారం, పత్రాలు ఇస్తున్నారు. ఆమె ఫిర్యాదులతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదు చేశారు. ఆయనను రేపోమాపో అరెస్టు చేయనున్నారు.
అయితే ఈ కేసులో మాఫియా లాగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. వారి విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైన వ్యూహంతో ఉందని చెబుతున్నారు. తప్పుడు కేసు నమోదు చేసి.. అరెస్టులు చేసుకు వచ్చిన వారు రికార్డుల పరంగా ఉన్న పోలీసులపై కేసులు పెట్టారు. వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఐపీఎస్‌లను ఎలా బాధ్యుల్ని చేయబోతున్నారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. వారు చేసింది చిన్న తప్పు కాదని.. కెరీర్ లో మర్చిపోని విధంగా శిక్ష ఉండేలా ప్రత్యేక వ్యూహం పాటిస్తున్నారని అంటున్నారు.
ఆ ముగ్గురు అధికారులు జెత్వానీని వేధించిన కేసులో దొరికారు కానీ.. చంద్రబాబును.. ఆయన కుటుంబాన్ని వేధించిన వారిలో ముఖ్యులు. అందుకే అంత త్వరగా వారిని వదిలి పెట్టే అవకాశం ఉండదని చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో వారిపై తీసుకునే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.