ఏపీలో వైసీపీ ఓటమితో నేతల రాత మారినట్లే… వైసీపీకి వ్యూహకర్తగా సేవలందించిన రిషి సింగ్ రాత మారిపోయింది. వైసీపీకి వచ్చిన సీట్లతో రిషి సింగ్ ఇక వ్యూహకర్తగా తప్పుకొని కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
2019లో వైసీపీకి పీకే నేతృత్వంలోని ఐ ప్యాక్ సూపర్ విక్టరీ అందించింది. పీకే టీమ్ లో కీలకంగా వ్యవహరించే రిషి ఆ తర్వాత వైసీపీకి సేవలందిస్తూ వచ్చారు. పీకే లేకుండా రిషి ఐ ప్యాక్ టీమ్ తో వైసీపీకి అధికారం అందించేందుకు తీవ్రంగానే శ్రమించినప్పటికీ… రిషి సింగ్ ప్రతిపాదించిన కొన్ని కీలక సూచనలను జగన్ పక్కన పెట్టేశారని, సజ్జల వంటి నేతల మాటలను విని ఓటమి కొని తెచ్చుకున్నారని వాదనలూ ఉన్నాయి.
ఏదీ ఏమైనా…వైసీపీ ఓటమి రిషి సింగ్ చరిష్మాను పలుచన చేసింది. ఆయన వ్యూహలు వర్కౌట్ కాలేదని, ఓటమికి ఆయన కూడా ఓ కారణమని వైసీపీలోని ఓ వర్గం నేతలు రిషి టీమ్ ను వేలెత్తి చూపారు. 151సీట్లు ఉన్న వైసీపీ 11 సీట్లకు పడిపోవడంతో ఆ పార్టీకి సేవలందించిన రిషిని భవిష్యత్ లో పొలిటికల్ పార్టీలు వ్యూహకర్తగా అపాయింట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో…ఆయన సాఫ్ట్ వేర్ కంపెనీనీ నడుపుతున్నారని అంటున్నారు.
నోయిడాలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని కొని హ్యాపీగా బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.