అంబటి రాంబాబు అలా కనిపిస్తారు కానీ ఆయన తెర వెనుక చేసే వ్యవహారాలను ఎవరూ ఊహించలేరు. ఆయన సోదరుడితో గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తున్నారు. ఎప్పుడో వైఎస్ గెలిచినప్పుడు కంపెనీ పెట్టించి.. మెల్లగా గుంటూరు నగరంలోని భజరంగ్ జూట్ మిల్లు స్థలాన్ని సొంతం చేసుకున్నారు. ఆ స్థలం వెనుక ఉన్న డీలింగ్స్ ఇంకా బయటకు రాలేదు. కానీ ఆ జూట్ మిల్లు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించేది. తర్వాత మూతపడింది. ఇప్పుడు బిల్డింగులు కడుతున్నారు.
అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ .. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారు. రైల్వేట్రాక్ పక్కనే ఉండే భజరంగ్ జూట్ మిల్లు స్థలంలో అపార్టుమెంట్ల నిర్మాణం ప్రారంభించరు. ఐదు అంతస్తులకు తీసుకుని పదిహేను అంతస్తులు కడుతున్నారు, కానీ అది పద్దెనిమిది అంతస్తులకు చేరిందని వెబ్ సైట్ లో పెట్టారు. కనీస అనుమతుల్లేకుండానే కట్టేస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ బయటపెట్టడంతో ఇప్పుడా అపార్టుమెంట్ ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రైల్వే కూడా ఐదు అంతస్తులకే ఎన్వోసీ ఇచ్చింది. కార్పొరేషన్ అసలు అలా అపార్టుమెంట్లు కట్టకూడదని నివేదిక రెడీ చేసింది. అంటే ఇప్పుడు ఆ ఆపార్టుమెంట్లు అమ్మలేరు.. కొనలేరు. కానీ ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి మాత్రం.. డబ్బుు తిరిగివ్వాల్సిందే. మొత్తంగా రాజకీయం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించాలనుకునేవారికి గడ్డు పరిస్థితే. డబ్బులు బాగా ఉన్నాయనేమో కానీ.. అంబటి సోదరుడికి పొన్నూరు టిక్కెట్ కూడా ఇచ్చారు.