హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద లక్షన్నర మంది ముస్లింలు ఉంటారు. ఇతర వర్గాలన్నీ కలిపి అరవై లక్షల వరకూ ఉంటారు. అయినా అక్కడ హేట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిమ్లాలో ఓ మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారని కొద్ది రోజులుగా హిందూ సంస్థలు ఆందోళన ప్రారంభించాయి. వాటిని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. నిజానికి ఆ మసీదు దశాబ్దల నుంచి ఉంది. ఆ మసీదుపై మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇది అక్రమ కట్టడం అని హిందూ సంఘాల వాదన.
కారణం ఏదైనా ఇప్పటి వరకూ హిమాచల్ ప్రదేశ్ టూరిజానికే ప్రసిద్ధి చెందింది. సిమ్లా గురించి చెప్పాల్సిన పని లేదు. మత చిచ్చు కు చాన్స్ లేదు. అక్కడ ఉన్న అతి స్వల్ప ముస్లింలు పెద్దగా రాజకీయంగాకూడా ఎదగడం లేదు. అయినా వారిని బూచిగా చూపించే రాజకీయం ప్రారంభం కావడంతో ఇక సిమ్లాలోనూ… ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే పరిస్థితి వచ్చింది. దీని వల్ల టూరిజంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే హిమాచల్ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎక్కువగా నష్టపోతోంది. ఇప్పుడు మత రాజకీయాల వైపరీత్యంతో మరింత ఇబ్బంది పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కు. .. ఈ రాజకీయాల వల్ల… డ్యామేజ్ జరిగితే.. మరింతగా నష్టపోతుంది.