ప్రకాశం బ్యారేజీలో బోట్లు బయటకు రావడం లేదు, ఎంత మంది నిపుణులు వచ్చినా రోజుల తరబడి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనేక కోణాల్లో ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకూ పెద్దగా ప్రయోజనం కలగలేదు. బోట్లు అత్యంత బరువుగా ఉన్నాయి. వాటిలో ఇసుక నింపి వదిలి పెట్టారన్న అనుమానాలు ఉన్నాయి. పైగా ఒకదానికి ఒకటి ముడి పెట్టి వదిలి పెట్టారు. ఆ బోట్లు తగలగానే..కౌంటర్ వెయిట్లుకూడా బద్దలయ్యాయి. ఇప్పుడా బోట్లు బ్యారేజీలో ఇరుక్కుపోయాయి.
వాటిని ఇష్టం వచ్చినట్లుగా లాగేస్తే.. బ్యారేజీకి డ్యామేజీ జరుగుతుందేమోన్న ఆందోళన ఉంది. అందుకే రూ.కోట్లు ఖర్చు అయినా అత్యంత జాగ్రత్తగా బయటకు తీసుకేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా వాటి బరువు తగ్గించేందుకు కట్ చేసి బ యటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. బ్యారేజీని ఖాళీ చేస్తే.. వెంటనే తీయవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు బ్యారేజీని ఖాళీ చేయడం అంత తేలిక కాదు.
ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల్ని సంప్రదించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బోట్లను కుట్రపూరితంగా వదిలారని ఇప్పటికే పోలీసులు గుర్తించారు., ఈ బోట్ల వల్ల ఇంకా ఏమైనా బ్యారేజీకి డ్యామేజీ జరిగితే బోట్ యజమానులకు..కుట్ర పన్నిన వారికి మరిన్ని చిక్కులు తప్పవు.