ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటోన్న ఎంపీ మిథున్ రెడ్డి

ఎంపీ మిథున్ రెడ్డి… మాజీ మంత్రి పెద్దిరెడ్డి కొడుకే అయినా, ఓ బ‌డా కంపెనీని న‌డిపిస్తున్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది కీల‌క నేత‌ల‌కు సుప‌రిచితుడు. రాజంపేట ఎంపీగా వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్న మిథున్ రెడ్డి… కొంత‌కాలంగా స్థానికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులను ఎదుర్కొంటున్నారు.

పుంగ‌నూరు ఎమ్మెల్యేగా ఉన్న త‌న తండ్రి పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గం వైపే రావ‌టం లేదు. ఎప్పుడైనా వ‌చ్చినా స్థానికంగా నిర‌స‌న‌లు, టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు తోడు అక్ర‌మంగా భూముల‌ను కొట్టేశార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతుండ‌టంతో పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. దీంతో అప్పుడ‌ప్పుడు స్థానిక ఎంపీగా ఉన్న ఆయ‌న కొడుకు మిథున్ రెడ్డి వ‌స్తున్నారు.

అయితే, ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. 2026లో ఏపీలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పున‌ర్విభ‌జించే అవ‌కాశం ఉంది. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం 2014 ప్ర‌కారం ఏపీలోనూ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వ‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ప్ప‌నిసరి. అదే జ‌రిగితే… పుంగ‌నూరు రెండు నియోజ‌క‌వ‌ర్గాలుగా మారితే… ఎక్క‌డో ఒక చోట నుండి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తాన‌ని, పుంగ‌నూరును వ‌దిలిపెట్టేది లేద‌ని ప్ర‌క‌టించారు.

పుంగ‌నూరును పెద్దిరెడ్డి ఫ్యామిలీ విడిచిపెట్ట‌బోతుందని కొంత‌కాలంగా స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. క్యాడ‌ర్ చేజార‌కుండా ఉండేందుకే మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌న్న ప్ర‌క‌ట‌న చేసి ఉంటార‌ని, ఎవ‌రు పోటీ చేసినా… పుంగ‌నూరులో పెద్దిరెడ్డికి వ‌చ్చేసారి ఓట‌మి రుచి చూడ‌టం ఖాయం అంటోంది టీడీపీ క్యాడ‌ర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close