మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు రాజ్. మారుతి సమర్పణలో వచ్చిన సినిమా ఇది. స్టొరీ ఐడియా కూడా ఆయనిదే. కానీ ఆ ఐడియా తెరపైకి ఎఫెక్టివ్ గా రాలేదు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీనికి తోడు మత్తువదలరా2 కి హిట్ టాక్ రావడంతో భలే ఉన్నాడేని ఆడియన్స్ లైట్ తీసుకున్నట్లుగానే కనిపించారు. థియేటర్స్ ఫుట్ ఫాల్ చూస్తుంటే అలానే వుంది.

మారుతి బ్రాండ్ తో వచ్చిన సినిమా ఇది. మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో రాజాసాబ్ చేస్తున్నారు. మారుతిని అనుకొని వుంటే ప్రభాస్ తో ఈ సినిమా ఏదో రకంగా ప్రమోషన్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఆ ఛాయిస్ తీసుకోలేదు. మారుతి ఐడియా అయినప్పటికీ అది స్క్రీన్ మీదకి బలహీనంగా వచ్చింది. ఆయనకి సినిమా రిజల్ట్ ముందే తెలుసేమో. అందుకే ఎలాంటి హడావిడి లేకుండా సినిమాని వదిలారు. సినిమా ఎలా వున్నా సక్సెస్ మీట్ పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ సినిమా విషయంలో పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా వద్దని బ‌లంగా చెప్పేశారట మారుతి. మొత్తానికి ఈ ఫ్లాప్ ప్ర‌భావం త‌న‌పై ప‌డ‌కుండా మారుతి త‌ప్పించుకొన్నా, రాజ్ తరుణ్ బ్యాడ్ టైమ్ కి మాత్రం ఆయ‌న‌ కూడా ఫుల్ స్టాప్ పెట్టలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close