వైసీపీ అధినేత జగన్ వరద బాధితుల సహయార్ధం ప్రకటించిన కోటి రూపాయల సాయం అందరికీ కాదు..కొందరికే అని తేలిపోయింది. ఆ కొందరికీ అయినా చేశారో లేదో క్లారిటీ లేదు. కానీ సాయం చేశామని ఎమ్మెల్సీ బొత్స చెప్పుకొచ్చారు. ఎక్కడ, ఎవరికి , ఎంతమేర సాయం చేశారన్న వివరాలు మాత్రం చెప్పలేదు..
జగన్ సాయం సొంత పార్టీ కార్యకర్తలకేనట. వరద బాధితులకు సాయం అని ప్రకటించి.. మళ్లీ కొంతమందికే సాయం అని పేర్కొనడంపై ఇదేం సాయమో అంటూ సెటైర్లు పేలుతున్నాయి. వరద బాధితుల్లో కూడా పార్టీలు , మా వాళ్ళు అంటూ విభజన రేఖ గీసి సాయం అందించడంపై వైసీపీ నేతలూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ సాయం పేరుతో పెద్ద హడావిడి చేసి..కొందరికే సాయం అని ప్రకటించడంతో గాలి తీసుకున్నట్లే ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విధమైన వైఖరి కొనసాగితే, కొనసాగిస్తే ఆయన ప్రతిపక్షానికి ఫెవికాల్ పెట్టుకొని కూర్చోవడమే అవుతుంది..ఎందుకంటే విజయవాడలో వైసీపీ కార్యకర్తలు కుటుంబాలకే సాయం అందిస్తే.. మిగతా వారి నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది పార్టీకి ఏమంత మంచిది కాదని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.
పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే సాయం అనే ప్రకటన పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ సీతయ్య లెక్క..మరి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటారో లేదో.