సినిమాకి ఇప్పుడు రెండు దశల్లో రివ్యూలు వస్తున్నాయి. థియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్. థియేటర్స్ లో చూస్తున్నపుడు ఆడియన్ మూడ్ వేరు. అక్కడ కాస్త ఉదారంగా ఉంటాడు ప్రేక్షకుడు. మామూలు జోక్ కూడా ఒక సమూహంలో పేలుతుంది. ఎలివేషన్స్ ఎంజాయ్ చేస్తాడు. కానీ ఓటీటీకి వచ్చేసరికి ఆడియన్ ఎలివేషన్స్ మెప్పించడం అంత ఈజీ కాదు. పైగా థియేటర్ లో పేలుతుందని రాసుకునన్న సీన్ ఓటీటీలో అస్సల్ ప్రభావం చూపించకపోవడం కూడా జరుగుతుంది.
అన్నిటికికంటే పెద్ద చిక్కు రిమోట్ చేతిలోనే వుంటుంది. కావాల్సిన చోట పాజ్, పార్వర్డ్, బ్యాక్ వర్డ్ చేసుకోవచ్చు. ఫ్రేం టు ఫ్రేం చూసుకునే అవకాశం వుంది. దీంతో ఫిల్మ్ మేకింగ్ లోని ప్రతి డిఫాల్ట్ ని మైకో స్కోప్ పెట్టిమరీ విమర్శ చేస్తున్నారు. అందుకే సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత కొత్తగా కొన్ని ట్రోల్స్ వస్తుంటాయి.
మిస్టర్ బచ్చన్ సినిమా ఇప్పుడు ఇలాంటి ట్రోల్ నే ఎదురుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ ఎలివేషన్ కి మచ్చ రవి క్యారెక్టర్ చెప్పే ఓ మోటు డైలాగ్ వుంది. నిజానికి అది థియేటర్స్ లో చుస్తునప్పుడు కాస్త అతి అనిపించింది. కానీ అదో మోటు మాస్ ఎలివేషన్ ని ఊరుకున్నారు. కానీ ఓటీటీకి వచేసరికి ఆ డైలాగ్ ఎబెట్టుతనం బయటపడింది. ఎలివేషన్ కి ఇంతకంటే దారి దొరకలేదా?అని కామెంట్స్ చేస్తున్నారు. ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి ‘అతి’ ధ్వనించే డైలాగులు, సీన్స్ విషయంలో జాగ్రత్త పడటం మంచింది.