బాచుపల్లి అంటే అమ్మో కాస్ట్ లీనా అనుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఒకప్పుడు అబ్బో బాచుపల్లినా అంత దూరం ఎవరు వస్తారు అనుకునేవారు. ఒకప్పుడు అంటే.. ఎంతో కాలంకిందట కాదు.. జస్ట్ పదేళ్ల కిందటే. ఇప్పుడు అది కాస్ట్ లీ ఏరియా అయిపోయింది. బాచుపల్లిలో కాలనీలు పెరిగిపోయాయి కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కాంక్రీట్ జంగిల్ కాలేదు. నిన్నామొన్నటిదాకా పంచాయతీగా ఉండి.. మంచి అలవాట్లతో పేరు తెచ్చుకున్న ప్రగతి నగర్‌కు అతి సమీపంలో ఉంటుంది బాచుపల్లి . మౌలిక సదుపాయాల కొరత లేదు.
ప్రధానంగా ఇళ్లు, కాలనీలు పెరగాలంటే.. విద్యా, వైద్యతో పాటు ఇతర వ్యాపార సౌకర్యాలు ఉండాలి. ఆ విషయంలో బాచుపల్లి ఎప్పుడో టాప్ క్లాస్‌కు చేరింది. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కెన్నెడీ హై స్కూల్ వంటి పేరుమోసిన స్కూల్సే ఉన్నాయంటే.. ఇక ఇతర విద్యాసౌకర్యాల గురించి చెప్పాల్సిన పని లేదు. వైద్య సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన వాటికి తప్ప.. ప్రధాన ఆస్పత్రులన్నీ ఉన్నాయి. ఇక్క సూపర్ మార్కెట్లు సహా అన్నీ.. బ్రాండెడ్ వి కొలువు దీరాయి.
బాచుపల్లికి కనెక్టివిటీ సమస్య లేదు. ORR, నిజాంపేట్ రోడ్, బొల్లారం రోడ్ లతో అనుసంధానమై ఉంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 7 కి.మీ ఉంటుంది. ఇటు వైపు ప్రజల ఎంక్వయిరీలు ఎక్కువ కావడంతో బిల్డర్లు కూడా అవకాశాలు అంది పుచ్చుకున్నారు. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా.. అలాగే లగ్జరీ కోరుకునేవారికి వారికి తగ్గట్లుగా నిర్మాణాలు చేస్తున్నారు. త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఇక్కడ రూ. 80 లక్షలకు వస్తోంది. స్థానిక బిల్డర్లే కాదు.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా బాచుపల్లిలో ప్రాజెక్టులు చేపట్టాయి.
చాలా మందికి బాచుపల్లిలో పొల్యూషన్ ఉంటుందనే అనుమానాలు ఉంటాయి. కానీ అలంటివేమీ ఉండవు. పరిశ్రమల వల్ల బాచుపల్లికి వచ్చే కాలుష్యం తక్కువ. ఇటీవలి కాలంలో పరిశ్రమలు ప కడ్బందీగా కాలుష్య నివారణ చర్యలు కూడా తీసుకుంటున్నాయి.