కబడ్డీలో అందర్నీ ఒకే సారి ఆలౌట్ చేసినట్లుగా వైసీపీ సోషల్ మీడియా టీం.. చివరికి గాసిప్ వెబ్ సైట్ తో సహా సెల్ఫ్ గోల్ చేసుకున్నాయి. మత పరమైన చిచ్చు రేపు కుట్రల కేసుల్లో ఇరుక్కోవడానికి అవసరమైన స్టఫ్ ను ఇచ్చాయి. చాలా మందికి సినిమా అర్థమైపోయి.. ట్వీట్లు డిలీట్ చేసుకున్నా..అప్పటికి సాక్ష్యాలన్నీ రికార్డయిపోయాయి. లోకేష్ కూడా స్పందించారు. టీటీడీ, పోలీసులు కూడా సోషల్ మీడియా వేదికగా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
ఫేక్ చేయాలన్న తొందరపాటుతో ఒక్క సారిగా వైసీపీ సోషల్ మీడియా టీం మొత్తం దొరికిపోయింది. కీలక వ్యక్తులంతా ఈ ట్వీట్ చేశారు. గాసిప్ సైట్ కూడా అదే పని చేసింది. ఇప్పుడు అందరి జుట్టు పోలీసుల చేతుల్లో ఉంది. ఇలాంటి సమయంలో మత ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని వర్గ వైషమ్యాలు వచ్చేలా చేస్తున్నారని కేసులు పెడితే.. లోపలిస్తే.. ఎవరూ అభ్యంతరం కూడా చెప్పరు. కక్ష సాధింపులని కూడా ఎవరూ అనుకోరు.
ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులు తీసుకోబోయే చర్యలపై ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. నిజానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవాలు చెప్పినా సరే పట్టుకెళ్లి లోపలేసి చిత్కొట్టేవారు. ఆ బాధలు పడిన టీడీపీ కార్యకర్తలు అలాంటి ట్రీట్ మెంట్ ఫేక్ చేస్తున్న వైసీపీ కార్యకర్తలకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇదేమీ .. వ్యక్తిగతంగా దుర్బాషలాడటం వంటివి కాదని.. ఖచ్చితంగా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమేనని అంటున్నారు. మరి ఏపీ పోలీసులు టీడీపీ కార్యకర్తల అంచనాల్ని అందుకోగలుగుతారా ?