తేజ సినిమా ‘హ‌నుమంతు’?

గ‌త కొంత కాలంగా తేజ కెరీర్ కాస్త స్థ‌బ్దుగా ఉంది. మ‌ధ్య‌లో ‘నేనే రాజు నేనే మంత్రి’ విజ‌యం కాస్త తెరిపి ఇచ్చింది. అయితే ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఫ్లాపు మూట గ‌ట్టుకోవాల్సివ‌చ్చింది. ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకొన్నారు. అయితే ఈలోగా త‌న త‌న‌యుడ్ని హీరోగా ప‌రిచ‌యం చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకొన్నారు. అందుకోసం కొన్ని క‌థ‌లు కూడా విన్నారు. ఎట్ట‌కేల‌కు ఓ క‌థ తేజ‌కు న‌చ్చింది. దీన్నే తెర‌పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. ఈ చిత్రానికి ‘హ‌నుమంతు’ అనే పేరు పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగ‌ని ఇది మైథాల‌జీ ట‌చ్ ఉన్న క‌థ కాదు. హ‌నుమంతుడి ల‌క్ష‌ణాలు ఓ కుర్రాడిలో క‌నిపిస్తుంటాయి, అంద‌రూ త‌న‌ని ‘హ‌నుమంతు’ అని పిలుస్తుంటారు. అత‌ని క‌థ‌ని.. తెర‌పై తేజ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో తెరకెక్కించ‌బోతున్నారు. తేజ తీసే సినిమాల‌న్నీ దాదాపుగా ల‌వ్ స్టోరీలే. ఈ ‘హ‌నుమంతు’ కూడా అదే జోన‌ర్‌లో తెర‌కెక్కించ‌బోతున్నార‌ని టాక్‌. అయితే తేజ త‌న మూస ధోర‌ణి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, ఈ సినిమా తీయ‌బోతున్నార‌ని, క్యారెక్ట‌రైజేష‌న్ నుంచి వ‌చ్చే ఫ‌న్ ఈ సినిమాలో ఎక్కువగా క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. తేజ త‌న‌యుడు ప్ర‌స్తుతం న‌ట‌న‌కు సంబంధించిన శిక్ష‌ణ తీసుకొంటున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా పేరు, ఇత‌ర వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌కటించ‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close