సీఆర్ఆర్ఎఫ్‌కు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని వైసీపీ నేతలు .. తమ వారు అందరికీ సమాచారం పంపారు. అందుకే కొంత మంది చెక్కులు తెచ్చి జగన్ కే ఇచ్చారు. అయితే జగన్ మాటను లెక్క చేయని మేకపాటి రాజమోహన్ రెడ్డి తన పాతిక లక్షల రూపాయల విరాళాన్ని సీఎంఆర్ఎఫ్‌కే పంపారు. అయితే తాను నేరుగా వెళ్తే ఇక తమ నాయకుడు తట్టుకోలేడన్న ఉద్దేశంతో స్పీడ్ పోస్టు ద్వారా పంపారు. తన ప్రతినిధులుగా కుమారుడ్ని కూడా పంపలేదు. అదే తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రం రాజమోహన్ రెడ్డి నేరుగా కలిసి ఇచ్చాడు.
జగన్ మనస్థత్వం తెలుసు కాబట్టి రాజమోహన్ రెడ్డి.. నేరుగా ప్రభుత్వానికి ఇవ్వడానికి జంకారు. కానీ ఇప్పుడు అయినా జగన్ మేకపాటిపై కినుక వహిస్తారు. ఎందుకంటే…సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలివ్వొద్దని పార్టీ ద్వారా సాయం చేయాలని ఆయన ఇప్పటికే సూచనలు పంపారు. కానీ మేకపాటి బాధమేకపాటిది. ఆయనకు బడా నిర్మాణ సంస్థ ఉంది. ఆయన ప్రభుత్వాలతో సున్నం పెట్టుకోలేరు. చంద్రబాబు వైసీపీ నేత కాబట్టి.. ఆయన సంస్థను నిర్వీర్యం చేయాలని అనుకోరు కాబట్టి కాస్త ధైర్యంగానే ఉన్నారు. అదే జగన్ అయితే మేకపాటి లాంటి వాళ్లు ఎంత వేదన అనుభవిస్తూ ఉంటారో చెప్పాల్సిన పని లేదు.
జగన్ రెడ్డి తాను కోటి ప్రకటించానని చెప్పి.. విజయవాడలో రెండు ఆటోల సరుకుల బస్తాల్ని పంపిణీ చేసి.. రూ. కోటి ఖర్చు మమ అనిపించారు. నిజానికి రూ. కోటితో ఏదో చేయాలనుకోవడమే అమాయకత్వం. ఎందుకంటే లక్షల్లో ఉన్నబాధితులకు రూ. కోటితో ఏమీ చేయలేరు . అయినా అతి కొద్ది మొత్తంలో అందులోనూ ఎంత పంచారో ఎవరికీ తెలియని మొత్తాన్ని పంచి.. తాము తమ కోటి ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. తన పాతిక లక్షలకు లెక్కలుండాలన్న ఉద్దేశంతో మేకపాటి సీఎంఆర్ఎఫ్‌కే చెక్కులు పంపించారు.