హైదరాబాద్ మహా నగరంలో ఎటు వైపు చూసినా హైరైజ్ అపార్టుమెంట్ల నిర్మాణం జరుగుతుంది. సాధారణ అపార్టుమెంట్లలో నివసించి అక్కడి సమస్యలను చూసిన వారికి… ఆ అపార్టుమెంట్లు చూస్తే… బాబోయ్ అనుకుంటారు. ఎందుకంటే హఠాత్తుగా లిఫ్ట్ పని చేయకపోతే ఎలా..?. నీటి సమస్య వస్తే ఎలా ?. అగ్నిప్రమాదం జరిగితే తప్పిచుకోగలమా ? అనే సందేహలు వస్తాయి. మరి వీటి విషయంలో హైరైజ్ అపార్టుమెంట్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయా ?
ప్రస్తుతం 10 అంతస్తుల నుంచి 60 అంతస్తుల అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. వీటిలో అత్యాధునిక లిఫ్టులు ఉంటాయి. క్షణాల్లో పై అంతస్తులకు వెళ్లడం.. రావడం చేయవచ్చు. మరి కరెంట్ లేకపోతే. ఇలాంటి సమస్యను పరిష్కరించడానికే ప్రతి అపార్టుమెంట్ కు పవర్ బ్యాకప్ ఉంటుంది. అవసరానికి రెండింతలు ఉండేలా బ్యాకప్ ఉంచుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఉంచుకోవడానికి అయ్యే నిర్వహణ ఖర్చులు మెయిన్టనెన్స్ రూపంలో ప్లాట్ల ఓనర్లే భరించాలి కాబట్టి కరెంట్ సమస్య దాదాపుగా రాదు.
మరి నీరు. నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది పెద్ద సమస్య . ఈ అపార్టుమెంట్లకు బోర్లు ఉంటాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ తో ఒప్పందం కూడా చేసుకుంటారు. మామూలు కన్నా ఎక్కువ రేటుతో ఈ హౌసింగ్ కాంప్లెక్స్ లకు నీరు సరఫరా చేస్తూంటారు. ప్రతి లీటర్ కూ లెక్క ఉంటుంది. అలాగే ఈ అపార్టుమెంట్లలో వాటర్ సెన్సర్లను పెట్టి వృధా కాకుండా చూసుకుంటారు. మున్సిపల్ వాటర్ రాకపోతే.. బోర్లు.. బోర్లు కూడా సమస్య వస్తే.. ట్యాంకర్లతో పరష్కరించుకోవాల్సిందే. అంటే.. అందరికీ ఎలా వస్తాయో.. వీటికీ అంతే. అయితే.. ఇంత పెద్ద అపార్టుమెంట్లకు ఎన్ని ట్యాంకర్లు తెస్తే సరిపోతాయన్న కంగారు కూడా ఉంటుంది. ఇటీవల బెంగళూరులో నీటి కొరత ఏర్పడినప్పుడు హైరైజ్ ఆపార్టుమెంట్ వాసులు కూడా ఇబ్బంది పడ్డారు.
ఇక అగ్నిప్రమాదాలు జరిగితే.. ఎలా అన్న భయం కూడా ఉంటుంది. ఒకప్పుడు గుడిసెల్లోనే అగ్నిప్రమాదాలు జరుగుతాయనుకుంటారు. ఇప్పుడు నిర్మాణాలు.. ఇంటీరియర్ వల్ల అపార్టుమెంట్లలో అగ్నిప్రమాదాలు జరిగితే ఆపడం కష్టంగా మారుతోంది. అందుకే అగ్నిప్రమాదాలు జరిగినే వెంటనే స్పందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుటున్నారు. ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టుల్ని కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఏ ప్రయత్నమూ ఫూల్ ఫ్రూఫ్ కాదు. నివాసితులు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని.. నిపుణుల వాదన.