లారెన్స్ తో బాబీ డియోల్ ఢీ

యానిమ‌ల్ త‌ర‌వాత విల‌న్ రోల్స్ కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా మారిపోయాడు బాబీ డియోల్‌. ప్ర‌స్తుతం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో ప్రతినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఇప్పుడు లారెన్స్ తోనూ ఢీ కొట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌.

లారెన్స్ క‌థానాయ‌కుడిగా ఏ స్టూడియోస్ సంస్థ ఓ భారీ యాక్ష‌న్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. లారెన్స్ న‌టించే 25వ చిత్ర‌మిది. రైడ్‌, రాక్ష‌సుడు చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్న‌ ర‌మేష్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం బాబీ డియోల్ ని సంప్ర‌దించింది చిత్ర‌బృందం. బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో న‌టించ‌డానికి త‌న అంగీకారం తెలిపిన‌ట్టు స‌మాచారం. క‌థానాయిక పాత్ర కోసం కూడా అన్వేష‌ణ మొద‌లైపోయింది. సౌత్ ఇండియాకు చెందిన ఓ స్టార్ క‌థానాయిక ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ర‌కుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన `కిల్` చిత్రానికి ఇది రీమేక్ అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇంత వ‌ర‌కూ దీనిపై ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. కిల్ రీమేక్ రైట్స్ కోసం తెలుగు నాట నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది. చాలామంది బ‌డా నిర్మాత‌లు రీమేక్ రైట్స్ కోసం ప్ర‌య‌త్నించారు. అయితే ఆ హ‌క్కులు ఎవ‌రి ఖాతాలోకి వెళ్లాయ‌ర‌న్న విష‌యం ఇప్ప‌టికీ స‌స్పెన్సే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close