దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర ట్రైలర్ గురించి తనదైన విశ్లేషణ ఇచ్చారు. ఈ సినిమాలో పరుచూరి కి రామాయణం పోలికలు కనిపించాయి.

‘రావణాసురుడి కోసం రాముడు సముద్రాన్ని దాటిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇందులో కొన్ని సన్నివేశాలు రూపొందించారేమో అని అనిపించింది. రాముడు సముద్రాన్ని దాటినట్లు ‘దేవర’లోనూ ఎన్టీఆర్‌ పడవపై నిల్చొని సముద్రాన్ని దాటుతున్నట్లు చూపించారు. ‘దేవరని చంపాలంటే సరైన సమయమే కాదు.. సరైన ఆయుధమూ దొరకాలి’ అనే డైలాగ్ వుంది. రామాయణంలోనూ రాముడు ఎన్నో బాణాలు ఉపయోగించాడు. ఇందులోని చాలా అంశాలు రామాయణాన్ని పోలి ఉంటుందనిపిస్తుంది’ అని అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ. ప‌రుచూరి సోద‌రుల‌కు నంద‌మూరి కుటుంబం అంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం. చిన ఎన్టీఆర్ అంటే మ‌రింత ప్రేమ‌. సినిమా విడుద‌లైయ్యాక ప‌రుచూరి గోపాల కృష్ణ పూర్తి స్థాయి రివ్యూ ఇవ్వాల‌ని అభిమానులు కోరుకొంటున్నారు.

భారీ అంచనాలు వున్న దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకులు ముందు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రికార్డ్ లెవల్ లో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. మరోవైపు ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close