నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప దేనికీ అనుమతుల్లేవు. అన్నింటినీ ప్రస్తుతానికి కోర్టుకెళ్లి ఆపుకున్నారు. ఆ గడువు కూడా ముగిసిపోతుంది.ఆ తర్వాత అయిన కూల్చివేయక తప్పదు. నల్లగొండలో బీఆర్ఎస్ ఆఫీసును కూల్చివేయకండా బీఆర్ఎస్ పై కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటే.. ఆ దారిలో వెళ్లడానికి వైసీపీకి అవకాశం ఉంటుంది. నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేస్తే… వైసీపీకీ తప్పదు.
ఏపీలో జగన్ పరిపాలన చేసిన కాలంలో ఒక్కటంటే ఒక్క చోట కూడా ప్రభుత్వ భవనాలు కట్టలేదు. మెడికల్ కాలేజీలు ఏళ్ల తరబడి నిర్మాణం అవుతూనే ఉన్నాయి కానీ ముందుకు సాగలేదు. కానీ వైసీపీ పార్టీ ఆఫీసులు మాత్రం ఇంద్ర భవనాల్లాగా ముస్తాబయిపోయాయి. వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను రూపాయికి.. రెండు రూపాయలకు లీజుకు రాసేసుకుని బిల్డింగులు కట్టేశారు. కానీ అనుమతలు మాత్రం తీసుకోలేదు. ప్రభుత్వం మారగానే ఆ ఆఫీసులన్నింటికీ నోటీసులు వెళ్లాయి. వాటిపై కోర్టుకెళ్లి కొంత గడువు ఇచ్చేలా చూసుకున్నారు.
కానీ ఏ కోర్టు అయినా అనుమతి లేని భవనాలను రెగ్యులరైజ్ చేయమని ఆదేశించదు. నల్లగొండలో అదే జరిగింది. కట్టేసిన భవనాలకు అనుమతి ఇప్పించాలని కోరితే..పిటిషన్ ను కొట్టేసింది. వైసీపీ కూడా అలాంటి పిటిషన్లకు అవకాశం లేదు. ఇప్పుడు వైసీపీ కార్యాలయాలన్నింటినీ ఇవాళ కాకపోతే రేపు నేలమట్టం చేయాల్సిందే. వైసీపీకి ఏదీ కలసి రాకపోవడం అంటే ఇదే.