జనసేన నేత, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రాగా కేసులు కూడా నమోదయ్యాయి. పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ అరెస్ట్ వార్తల సమయంలోనే… జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇండైరెక్ట్ గా స్పందించటం నాగబాబుకు అలవాటు. ఇప్పుడు కూడా తాను ఒక నీతి వ్యాఖ్యాన్ని షేర్ చేశారు. మనం విన్నది అంతా నిజం కాదు. విన్నవన్నింటిని నమ్మకండి. ప్రతి అంశానికి మూడు దశలుంటాయి. ఒకటి అవతలి వారి వాదన, రెండోది ఇవతలి వారి వాదన… ఫైనల్ గా నిజమేంటో తేల్చటం అంటూ పోస్ట్ చేశారు.
జానీ మాస్టర్ ఇష్యూలో మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద కూడా కేసు బుక్ చేశారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా సదరు మహిళ ఎందుకు బయటకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్పారో కూడా ఆలోచించాలి అన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో నాగబాబు పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆరోపణలన్ని నిజం కాదు… కోర్టులో అది నిజం తేలిన తర్వాతే సదరు వ్యక్తి తప్పు చేసినట్లు అంటూ జానీ మాస్టర్ పేరు తీయకుండా నాగబాబు మరో ట్వీట్ చేశారు.
ఈ ఇష్యూలో మహిళా కొరియోగ్రాఫర్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండగా ఉన్నారని, కావాలనే ఈ కేసును తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ప్రచారం సమయంలో నాగబాబు ట్వీట్ చర్చనీయాంశంగా మారుతోంది. గతంలోనూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ నాగబాబు ఎపిసోడ్స్ జరిగిన అంశాన్ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.