తాను ఏనాడూ ఏదీ ఆశించకుండా, మంత్రిపదవిని సైతం వదులుకొని జగన్ వెంట నడిస్తే… నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నా పట్టించుకోలేదని మాజీ మంత్రి బాలినేని మండిపడ్డారు. జగన్ వెంటనే కష్టకాలంలో నడిచిన 17మంది ఎమ్మెల్యేలను ఏనాడూ పట్టించుకోలేదని… వారిలో ఒక్కరైనా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారా అని ప్రశ్నించారు.
వైఎస్ ను తిట్టిన వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని, నా సొంత సమస్య కోసం ఏనాడూ జగన్ ను ఏదీ అడగలేదన్నారు బాలినేని. వైఎస్ వల్లే నేను రాజకీయంగా ఎదిగానని, ఆయన ద్వారానే మంత్రి పదవి వచ్చిందన్నారు.
జగన్ వెంట నడిచిన సమయంలో ఉప ఎన్నికలు వస్తే సొంత డబ్బుతోనే ఎన్నికలకు వెళ్లామని, ప్రజల సమస్యలు ఉంటే ముఖం మీద చెప్పానని.. అదే ఇబ్బంది అయి ఉంటుందన్నారు. మంత్రులను మార్చుతానన్న రోజు కూడా నేనే ముందుగా స్వాగతించా, కానీ జగన్ చేసిన విధానం తప్పు అని స్పష్టం చేశారు.
తనను కావాలని తిట్టించారని, వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తాను ఎంతో ఏడ్చానని… ఎలాంటి షరతులు లేకుండానే జనసేనలోకి వెళ్లబోతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తో సమావేశం తర్వాత అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని, తాను పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని బాలినేని స్పష్టం చేశారు.