మనిషి జీవితం క్రమబద్ధంగా సాగాలంటే ప్రతి వ్యక్తికి ఓ భయం ఉండాలి. ఆ భయం ఉంటేనే తప్పు చేస్తున్నప్పుడు ఆలోచిస్తాడు. ఎక్కువ మందికి అలాంటి భయం దేవుడు. దాన్ని భక్తిగా కూడా చెప్పుకోవచ్చు. దేవుడు ఉంటాడు.. మనం చేసేవి చూస్తూంటాడు.. తప్పు చేస్తే శిక్షిస్తాడన్న భయం .. మనుషుల్ని కొంత వరకూ దారిలో పెడుతుంది. అలాంటి భక్తి , భయం లేని వాళ్లు మృగాల్లా మారుతారు. వారికి తల్లిదండ్రులన్నా భయం ఉండదు.. దేవుడన్నా భయం ఉండదు. తాము ఏం చేయాలనుకున్నామో అది చేసి.. తాము చేసిందే న్యాయం … తాము అనుకున్నదే నిజం అనుకుంటారు. ఇలాంటి వాళ్లు మన సమాజంలో అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్లు ప్రజల భవిష్యత్ ను నిర్దేశించే పాలకులుగా మారితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. ఒకే ఒక్క చాన్స్ అడిగారని కరిగిపోయి ఇచ్చిన ఐదేళ్లలో.. ఆ అరాచక శక్తి ఏం చేసిందో.. ఇప్పుుడ బయటపడుతూంటే.. ప్రజలకు ఒళ్ల జలదరిస్తోంది.
కొవ్వు పట్టిన గత పాలకుల ఘోరం
కలియుగదైవం శ్రీనివాసుడు. ఆయన వేంచేసి ఉన్న తిరుమలలో తప్పుగా ఆలోచించినా లెంప లు వేసుకుంటారు భక్తులు. ఆయనకు ముడుపులు కట్టి హుండీలో వేస్తూంటారు. యావదాస్తిని ఇచ్చే వారుంటారు. తమ తొలి సంపాదన ఇచ్చే వారంటారు. దేవదేవుని ఒక్క క్షణం దర్శనం కోసం రోజంతా నిలువ కాళ్లపై ఉండమన్నా ఉంటారు. అలాంటి చోట.. పాలకులుగా .. ఏ మాత్రం భయం భక్తి లేని వారు ఉంటే ఏం జరుగుతుందో తిరుమలలో అదే జరిగింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం వైసీపీ హయాంలో అత్యంత ఘోరంగా మారిపోయాయనడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడగానే.. క్వాలిటీ ఎందుకు తగ్గిపోయిదో ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీ వేశారు. ఆహార పదార్ధాలను ల్యాబ్లో పరీక్షించారు..దేశంలోనే అత్యున్నతమైన ల్యాబ్లో చేసిన టెస్టులో నెయ్యి విషయంలో వచ్చిన రిజల్ట్ చూస్తే.. ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించబుద్దయిందని ఎవరికైనా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే.. ఆ నెయ్యిలో నెయ్యి శాతం కేవలం 19 శాతం మాత్రమే. మిగతా 81 శాతం సర్వ దరిద్రాలను కలిఫారు. దానితోనే లడ్డూలు, శ్రీనివాసుడి అన్న ప్రసాదాలు తయారు చేసి పెట్టారు. తల్చుకుంటేనే ఇంత ఘోరమా అనిపిస్తుంది. దాన్ని వైసీపీ ప్రతినిధులు .. పాలకులు నిజం చేసి చూపించారు.
శ్రీవారిని మార్కెటింగ్ టూల్గా మార్చుకున్న దౌర్భాగ్యం
తిరుమల దేవుడ్ని వైసీపీ నేతలు ఎప్పుడూ ఓ ఆదాయవనరుగా.. ఓ మార్కెటింగ్ వస్తువుగానే చూశారు. అధికారంలోకి రాగానే మొదట రక్షణ శాఖలో పని చేస్తున్న ధర్మారెడ్డి అనే అధర్మారెడ్డిని తెచ్చి జేఈవోగా నియమించారు. ఆయన జేఈవో అయినా పెత్తనం ఆయనదే. ఈ ధర్మారెడ్డి క్రిస్టియన్ అని.. శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణల్ని ఎవరూ మర్చిపోలేరు. టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారిని అది కూడా సీనియర్ ను నియమించడం సంప్రదాయం. కానీ రక్షణ శాఖలో ఓ సాధారణ ఉద్యోగి అయిన ధర్మారెడ్డిని తెచ్చి టీటీడీ ఈవోగా చేసేశారు. ఐదేళ్ల పాటు ఆయన కనుసన్నల్లోనే టీటీడీ పాలన సాగింది. టీటీడీ చైర్మన్ గా అత్యధికా కాలం వైవీ సుబ్బారెడ్డి.. చివరిలో కరుణాకర్ రెడ్డి వ్యహరించారు. టీటీడీ బోర్డు నిర్ణయాలను ఆన్ లైన్ పెట్టడం కూడా ఆపేశారు. అంతా ఇష్టారాజ్య పాలన. అడిగేవారు లేరు. శ్రీవారి టిక్కెట్ల పేరుతో భక్తుల్ని ఎన్ని వందల కోట్లుక దోచుకున్నారో చెప్పాల్సిన పనిలేదు. వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో.. ప్రజా ప్రతినిధులు వందల టిక్కెట్లు తీసుకుని అమ్ముకుని పడగలెత్తారు. ఒక ప్రజాప్రతినిధి సిఫారసు మీద యాభై మందికి టిక్కెట్లు జారీ చేసేవారంటే ఎంత అరాచకం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ చిల్లర మోసాలు.. అసలు దోపిడీ.. హిందూత్వంపై కత్తివేటు వేసినట్లుగా వేశారని మెల్లగా బయటపడుతోంది. చివరికి ఎన్నికలకు ముందు టీటీటీ చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడు గెలిచేందుకు అవసరమైన ఖర్చు అంతా శ్రీవారి ఖాతాలో రాసేసేశారు. ఇంజినీరింగ్ పనులను మంజూరు చేయించుకుని కాంట్రాక్టర్లకు ఇచ్చేసి పది శాతం కమిషన్లు తీసుకుని ఎలక్షన్లు చేశారు. అంతా బహిరంగమే. దీనిపై విజిలెన్స్ ఇప్పటికే చాలా విషయాలు బయటకు తీసింది. నోటీసులు కూడా జారీ చేస్తోంది.
బయటపడాల్సిన అరాచకాలు ఎన్నో !
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. హిందువులకు దేవదేవుడైన శ్రీనివాసుడ్ని ఒక్క క్షణం దర్శనం చేసుకుని ఒక్క ముక్క లడ్డూ ప్రసాదాన్ని నోట్లో వేసుకునే భాగ్యం కోసం ఖండాంతరాలు దాటి వస్తారు. కొండపై ఎన్ని గంటలైనా క్యూ లైన్లలో ఎదురు చూస్తారు. అలాంటి చోట యంత్రాంగం భక్తుల విశ్వాసాలను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏం చేశారు.. ప్రజలు తమకు దోచుకునే అవకాశాన్ని ఇచ్చారని అనుకున్నారు. ఎంత అన్యాయం అయితే.. యాభై ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని బ్రాండ్ నెయ్యిని కాకుండా తక్కువకు ఇస్తారని ఎక్కడి నుంచి తెస్తారో తెలియని కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారా ?. ఆ కంపెనీలు విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకుని దాన్నే నెయ్యిగా మార్చి పంపిణీ చేస్తే కళ్లు మూసుకుని తీసుకుని లడ్డూల తయారీకి ఉపయోగిస్తారా ?. ఇందులో ఎన్ని వందల కోట్ల కమిషన్లు మింగారో విచారణలో బయటపడుతుంది. పడకపోయినా దేవుడికి ఖచ్చితంగా తెలుసు. బయటపడింది ఇది ఒక్కటే.. కానీ బయటపడాల్సిన అరాచకాలు ఎన్ని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో మొదటిది శ్రీనివారిని తమ కేసుల విముక్తికి ఓ టూల్ గా ఉపయోగించుకోవడం. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి.. దేవుడి దగ్గర ఉన్న తన పదవిని దుర్వినియోగం చేస్తూ ఎంత మందితో లాబీయింగ్ చేశారో కథలు కథలుగా ఢిల్లీలో చెప్పుకుంటారు. ముఖ్యంగా న్యాయమూర్తుల వద్దకూ వెళ్లేవారు. ఆయన చేసిన లీలల గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ.. ఆయన శ్రీవారిని ఇలా వాడేస్తున్నారేంటి అని ఆశ్చర్యపోయేవారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఓ సందర్బంలో భారత చీఫ్ జస్టిస్ కే.. మీరు చెప్పిన వారికి టీడీపీ సభ్యత్వం ఇస్తామని ఆఫర్ పెట్టారంటే.. దేవుడ్ని ఏ రేంజ్ సలో మార్కెట్ చేసుకున్నారో చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేక విమానాల్లో న్యాయమూర్తులకు దర్శనాలు చేయించడం దగ్గర నుంచి.. నేరుగా ప్రసాదాలను బట్వాడా చేయడం వరకు వారు చేయని అరాతచకాలు లేవు. ఇలా దేవడితో గేమ్స్ ఆడిన వారికి అధికారంతో కళ్లు మూసుకుపోయి దేవుడు కూడా తమను ఏమీ చేయడని అనుకునేంత స్థాయికి వెళ్లిపోయారు. అందుకే దేవుడితోనే గేమ్స్ ఆడారు. కానీ ఆయన దేవుడు.. ప్రతి దాన్ని లెక్క రాసుకుంటాడు. సమయం వచ్చినప్పుడు శిక్షిస్తాడు. ఇప్పుడు జరుగుతోంది అదే.
దేవుడు ఒక్కడే !
తాము నమ్మే దేవుడు వేరని వీరు అనుకుని ఉండవచ్చు. ఈ దేవుడ్ని ఎంతగా బద్నాం చేసిన తమ దేవుడు తమన రక్షిస్తాడని అనుకుని ఉండవచ్చు. ధర్మారెడ్డి అయినా సుబ్బారెడ్డి అయినా.. కరుణాకర్ రెడ్డి అయినా ఎవరికీ హిందూత్వం మీద నమ్మకంలేదు. హిందూ దేవుళ్ల మీద అసలే నమ్మకం లేదు. సుబ్బారెడ్డి పక్కా క్రిస్టియన్. ఆయన భార్య చేతిలో బైబిల్ తోనే ఉంటారు. కానీ ఆమె నాలుగేళ్లు తిరుమల గర్భగుడిలోనే సంచరించారు. ఇక కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ పద్దతిలో చేశారు.. ఆయన స్వయంగా దేవుడిపై నమ్కకం లేని వ్యక్తి. రాడికల్ ఉద్యమంలో ఉన్నప్పుడు తిరుమల దేవుడి గురించి ఆయన చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకుంటే మహాపాపం. అలాంటి వారు. వీరిలో ఎవరైనా దేవుడి ప్రసాదం తింటారన్న గ్యారంటీ కూడా ఉండదు. కానీ వీరు ఆ దేవదేవుడి సామ్రాజ్యానికి పాలకులయ్యారు. తమకు చాన్స్ వచ్చింది దోచుకోవడానికే అన్నట్లుగా వ్యవహరించారు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. నిజానికి వీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. దేవుడు ఒక్కడే. అల్లా, జీసస్, ఈశ్వరుడు ఎవరైనా ఒక్కటే. మనిషి చూసే చూపులోనే అంతా ఉుంటంది. అలాగే .. మనిషి ఆలోచనల్లోనే అంతా ఉంటుంది. చెట్టులోనూ పుట్టలోనూ దేవళ్లను చూడటానికి అదే కారణం. ఆకలితో ఉన్న వారికి కడుపు నింపడం దైవత్వం. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునేనాడే దేవుడు. ఒక్క సారి అలా చేసి చూడండి… దేవుడే మీ రూపంలో వచ్చాడని ఎదుటి వాళ్లు అనకుంటారు. ఆ దేవుడు.. తాము నమ్మిన దేవుడనే అనుకుంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు రక్షించమని అందరూ దేవుడా..దేవుడా అంటారు. ఎందుకంటే.. అదో శక్తి. ఒక దేవుడి ఎక్కువ శక్తి..మరో దేవుడికి తక్కువ శక్తి ఉండదు. ఎందుకంటే.. దేవుళ్లంతా ఒక్కటే. తప్పు చేస్తే తప్పక శిక్షిస్తారు. ఇప్పుడు వైసీపీ , ఆ పార్టీ నేతలు అలాంటి శిక్షను ఎదుర్కోబోతున్నారు. దేవుడిపై ఎప్పటికీ దెయ్యానిది పైచేయి కాదు.
తిరుమలలో జరిగిపోయిన అరాచకాలను బయటపెట్టడం ద్వారా.. ఇప్పుడు పని చేస్తున్న వారు.. తర్వాత ఎవరైనా స్వామి వారి సేవకు అవకాశం దక్కిన వారు తప్పు చేయకుండా ఉండేందుకు ఓ వార్నింగ్ ఇచ్చినట్లయింది. జరిగిన పరిణామాలను చూస్తూ దేవునిపై ఇప్పటికైనా భయభక్తులు పెంచుకుని.. మంచి తనంతో బతకడం నేర్చుకోవాలని ఆశిద్దాం !