మార్పు గమనించారా – ఏపీలో ఇప్పుడు బూతుల్లేవు !

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజకీయాల్లో బూతులు కామన్. అవి లేకపోతే అసలు రాజకీయ స్పీచ్‌లే ఉండేవి కాదు. అది అసెంబ్లీ అయినా సరే.. జనాల చెవులకు పట్టిన తుప్పును వదలగొట్టేవాళ్లు. చేతల్లోనూ ఏమీ తగ్గేవాళ్లు కాదు . ఎంత ఘోరం అంటే.. కాకినాడ ద్వారంపూడి వంటి వాళ్లు నోటి విరోచనలు చేసుకోవడమే కాకుండా.. మహిళలతో కలిసి మిడిల్ ఫింగర్ చూపించి వెకిలి నవ్వులు నవ్వేవాళ్లు. ఆ వైసీపీ మహిళలు కూడా మిడిల్ ఫింగర్ చూపించేవారు. దానికి అర్థం వారికి తెలుసనుకోవాలో.. తెలియదనుకోవాలో ?

ఐదేళ్ల పాటు వ్యక్తిత్వ హననం చేయడం.. కుటంబాల్ని తిట్టడం మాత్రమే రాజకీయం అన్నట్లుగా సాగిపోయింది. ప్రజలకు కూడా విరక్తి పుట్టింది. వీరినా మనం ఎన్నుకున్నది అని అనుకున్నారు. మరోసారి అలాంటి తప్పు చేయలేదు. ఒక్క సారిగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. స్వచ్చమైన భాష వినిపిస్తోంది. రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్ప.. ఒక్కరు కూడా లుచ్చా భాష మాట్లాడటం లేదు. చివరికి వైసీపీ నేతలు కూడా. ఎందుకంటే.. జరిగిన నష్టమేంటో తెలుసు..మరోసారి అలాంటి భాష మాట్లాడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు .

ప్రజలు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు రాజకీయాలు కూడా కాస్త స్వచ్చంగా కనిపిస్తున్నాయి. లోపల కుట్రలు, కుతంత్రాలు ఎన్ని ఉన్నాయో కానీ బయటకు మాత్రం.. ప్రజల ముందు రాజకీయం గౌరవంగా మారుతోంది. ఇది ప్రజలు తెచ్చిన మార్పు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ల‌డ్డూ గాడి పెళ్లిలో ‘మ్యాడ్‌’ గోల‌!

https://www.youtube.com/watch?v=AAfT5vNukzc గ‌తేడాది విజ‌య‌వంత‌మైన సినిమాల జాబితాలో `మ్యాడ్‌` కూడా ఉంటుంది. ముగ్గురు యువ హీరోల‌తో చేసిన ఈ ప్ర‌య‌త్నం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని రాబ‌ట్టింది. `మ్యాడ్` విజ‌యంలో వినోదానికి, దాంతో పాటు సంగీతానికీ...

మీడియా వాచ్‌: అక్కినేనిని మ‌రిచిన ఈనాడు

ఈరోజు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు శ‌త జ‌యంతి. ఓ మ‌హాన‌టుడి ప్ర‌యాణంలో, ప్ర‌స్థానంలో శ‌తాబ్ద కాలం పూర్త‌య్యింది. ఓర‌కంగా తెలుగు చిత్ర‌సీమ పండ‌గ‌లా జ‌రుపుకోవాల్సిన త‌రుణం ఇది. అయితే ఏపీలో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే చ‌క్క‌బ‌డుతున్నాయి....

దిల్‌రాజుకు కీల‌క పద‌వి?

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌) ఛైర్మ‌న్‌గా దిల్ రాజును ఎంపిక చేయొచ్చ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌....

కొత్త ట్రెండ్ : ఇంటికన్నా ఇంటీరియర్ ఖర్చు ఎక్కువ !

ఓ దశాబ్దం కిందట ఇల్లు అంటే... గోడలు, అల్మరాలు మాత్రమే. ఇంకా కాస్త డబ్బు ఉంటే.. ఆ అల్మరాలకు ప్లైఉడ్ తలుపులు పెట్టించుకుంటారు. కానీ తర్వాత రాను రాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close