బీఆర్ఎస్ సోషల్ మీడియాకు తప్పు ఏదో.. ఒప్పు ఏదో తెలియడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ఆ విమర్శల్లో అయినా కనీస లాజిక్ ఉండాలని అనుకోవడం లేదు. బీఆర్ఎస్ మహిళా నేతల్ని పోలీసులు హరీష్ ఇంట్లోకి అనుమతించలేదు.. రోడ్డుపై నిలబెట్టారంటూ…ఒక ప్రముఖుడు పోస్టు చేస్తాడు. మహిళా నేతలైనా.. మగ నేతలైనా.. పోటుగాళ్లైనా.. నేల మీద నిలబడాల్సిందే. వారేమీ గాల్లో ఎగరరు. ఇలాంటి విచిత్రమైన పోస్టుల దగ్గర నుంచి క్రిషాంక్ అనే పెద్దమనిషి.. పెట్టే పోస్టుల వరకూ ఎన్నో ట్రోలింగ్స్ కు స్టఫ్ .. ఇస్తున్నారు.
హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో స్కిల్ యూనివర్శిటీపై రేవంత్ చర్చించారు. అనంద్ మహింద్రా హాజరయ్యారు. ఈ సమావేశానికి హెరిటేజ్ సంస్థను నడుపుతున్న నారా బ్రహ్మణి వచ్చారు. ఈ దృశ్యాలు అధికారికంగా విడుదల చేశారు. ఆ వీడియోల్లో స్క్రీన్ షాట్ తీసుకున్న క్రిషాంక్.. గొప్ప విషయం కనిపెట్టినట్లుగా పోస్టు పెట్టారు. ఆమె పొలిటికల్ కారణాలతో రాలేదు. ప్రభుత్వం ఓ మంచి ఆశయంతో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్శిటీ ఓ కార్పొరేట్ కంపెనీ మేనేజ్మెంట్గా సహకరిచేందుకు వచ్చింది. ఇందులో ఏమైనా రాజకీయం ఉందా ?
కానీ క్రిషాంక్ స్కాలరే కానీ.. ఇంగితం లేదు. ఫోటో పెట్టేసి ఏదో కనిపెట్టిసినట్లుగా ప్రచారం ప్రారంభించారు. మొత్తం సోషల్ మీడియాను ఆయన నడుపుతున్న తీరే అలా ఉంది. పక్కా ఫేక్ న్యూస్ అని తెలిసే వాటిని కూడా ప్రజల మైండ్ లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా వారు ప్రజల విజ్ఞతను పరీక్షించడం మానుకోవాలి. అలా చేసే వైసీపీ నామరూపాల్లేకుండా పోతోంది. బీఆర్ఎస్ ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిందే.