విడదల రజనీ వసూళ్లపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది . అధికారంలో ఉన్నప్పుడు చిలుకలూరిపేట మొత్తాన్ని దున్ని పారేసినట్లుగా వసూళ్లు చేశారు రజనీ గ్యాంగ్. ఆమె బావమరిది ఈ గ్యాంగ్ ను నడిపించారు. నియోజకవర్గంలో ఎక్కడ క్రషర్ నుంచి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి వ్యాపారాలు ఉన్నా వసూళ్లు చేశారు. చివరికి జగనన్న ఇళ్ల పేరుతో చేసిన భూముల కొనుగోళ్ల విషయంలోనూ అదే అవినీతి. చివరికి కొంత మంది రైతులకు నగదు తిరిగి ఇచ్చారు. కానీ ఫిర్యాదు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
తాజాగా హోంమంత్రి అనితను.. బాలాజీ స్టోన్ క్రషర్స్ పేరుతో వ్యాపారం చేసే వాళ్లు వచ్చి కలిశారు. రజనీ తమ వద్ద ఐదు కోట్లు డిమాండ్ చేసిందని.. ఇవ్వకపోయే సరికి రూ. యాభై కోట్లు ఫైవ్ వేయించి.. ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. తర్వాత రెండున్నర కోట్లకు సెట్ చేసుకుని డబ్బులు తీసుకున్నారని.. ఇప్పుడు తమ డబ్బులు తమకు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అనిత విచారణకు ఆదేశించారు.
విడదల రజనీ… చిలుకలూరిపేటలో చేసిన నిర్వాకాలు, వసూళ్ల కారణంగానే అక్కడ ఆమె గెలవడం అసాధ్యమని గుర్తించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానిక పంపారు. అక్కడ ఇంకా ఘోరంగా ఓటిమి పాలయింది. విడదల రజనీ వైసీపీ నేతల్ని కూడా వదిలి పెట్టలేదు. తన స్థానంలో ఇంచార్జ్ గా నియమించిన వ్యక్తి వద్ద ఎనిమిది కోట్లు వసూలు చేసింది. తర్వాత ఆ ఇంచార్జ్ పదవి తీసేయడంతో… రచ్చ జరిగింది. మూడు కోట్లు ఇచ్చి ఇక ఇవ్వలేనని సజ్జలతో చెప్పించింది. తర్వాత గుంటూరు మేయర్ కు చిలుకలూరిపేట టిక్కెట్ ఇప్పించి మరింత వసూలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
విచారణకు ఆదేశించడంతో అన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆమె జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ గ్రీన్ సిగ్నల్ ఇంకా లభించలేదు.