కొత్త ట్రెండ్ : ఇంటికన్నా ఇంటీరియర్ ఖర్చు ఎక్కువ !

ఓ దశాబ్దం కిందట ఇల్లు అంటే… గోడలు, అల్మరాలు మాత్రమే. ఇంకా కాస్త డబ్బు ఉంటే.. ఆ అల్మరాలకు ప్లైఉడ్ తలుపులు పెట్టించుకుంటారు. కానీ తర్వాత రాను రాను సీన్ మారిపోయింది. ఇప్పుడు ఇల్లంటే.. నందన వనం. ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత గొప్పగా ఉంటుంది. ఓ కోటి రూపాయలతో అపార్టుమెంట్ ఫ్లాటో… ఇండిపెండెంట్ హౌసో కొనడంతోనే అయిపోదు. ఇంటీరియర్ కోసం.. భారీ మొత్తంలో ఖర్చు చేయాల్స ివస్తోంది.

కోట్ల రూపాయలు పెట్టి ఇంటిని కొనుగోలుచేసినా.. ఆ ఇంటిని అందంగా తీర్చి దిద్దేందుకు మళ్లీ అంత బడ్జెట్ పెట్టేందుకు మిలీనియల్సే కాదు… డబ్బును పొదుపుగా చూసే పెద్దలు కూడా వెనుకాడటం లేదు. అందుకే ఇప్పుడు నిర్మాణరంగానికి సమాంతరంగా హైదరాబాద్ లో ఇంటీరియర్ వ్యాపారం పెరుగుతూ పోతోంది. ఇందు కోసం పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు కూడా పుట్టుకొచ్చాయి. లివ్ స్పేస్, హోమ్ లైన్ వంటివి ఇప్పటికే తమదైన ముద్ర వేస్తుననాయి.

మొదట ఇంటిని మొండిగోడలుగా మాత్రమే కట్టి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారు. మిగతా అంతా ఇల్లు కొనుగోలుదారులు డిజైన్ చేసుకుంటున్నరు. ఇందు కోసం ప్రొఫెషనల్స్ ను నియమించుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైన్‌ లకు చాలా డిమాండ్‌ పెరిగింది. తమ అభిరుచికి తగ్గట్లుగా రాజీపడకుండా డిజైన్లను రూపొందించుకుని వాటి కోసం.. నిపుణులైన పని వారిని పెట్టుకుంటున్నారు. మామూలుగా సీలింగ్‌కు జిప్సం బోర్డులు వాడతారు. అవి అత్యంత చవకైనవి. కానీ ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ ,పీవోపీలను వాడుతున్నరాు. లైటింగ్, వాల్‌ పేయింట్స్, టెక్షర్‌ వాల్‌ పేపర్లు, ఫర్నిచర్, ఉడ్‌ వర్క్‌పై ఖరీదైన లామినేట్స్‌ ఉపయోగిసతున్నాు.

లగ్జరీని కోరుకునే వారికి.. ఇంటిని అందంగా ఉంచుకోవాలనుకునేవారి అనేక ఇంటీరియర్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. వుడ్ ఫ్లోర్ నుంచి మొదలు గ్లాస్ ఫ్లోర్ వరకు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. కోటి రూపాయలు పెట్టి ఇంటిని కొనుగోలు చేస్తే 20 నుంచి 30 లక్షల వరకు ఇంటీరియర్ కోసం వెచ్చించేదుకు వెనుకాడటం లేదు. ప్రస్తుతానికి ఎగువ మధ్యతరగతి వారు మాత్రమే .. ఈ ఇంటీరియర్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో మధ్యతరగతి వారికీ ఈ ఇంటీరియర్ ప్రత్యేక మోజు కలగడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సందీప్ సినిమాకు భ‌లే రేటు

సందీప్ కిష‌న్ - త్రినాథ‌రావు న‌క్కిన కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. దీనికి 'మ‌జాకా' అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ధారి. 2025 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న‌ది...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం… ఘాటుగా స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం విచారకరమని పేర్కొన్న...

బ‌తుక‌మ్మ‌తో క‌విత రీ ఎంట్రీ ఇస్తారా…?

తెలంగాణ సంస్కృతికి అద్దంప‌ట్టే బతుకమ్మ ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. బ‌తుక‌మ్మ పండుగ మొద‌ల‌వుతుందంటే చాలు ఉద్య‌మ స‌మ‌యం నుండి ఎమ్మెల్సీ క‌విత హాడావిడి మొద‌లుపెడ‌తారు. ప్ర‌తిసారి తెలంగాణ‌వ్యాప్తంగా జాగృతి...

తిరుప‌తి ల‌డ్డూ వివాదం …జ‌గ‌న్ స్పందించ‌క తప్ప‌టం లేదు

తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదం అంటే క‌ళ్ల‌కు అద్దుకొని తింటారు. వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే ఎంత భాగ్య‌మో... ప్ర‌సాదాన్ని కూడా అంతే గౌర‌వంగా చూస్తారు. అలాంటి ల‌డ్డూ ప్ర‌సాదంలో వాడిన నెయ్యిలో జంతువుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close