జగన్ రెడ్డి హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మహా విషాదం. వారికి పెద్ద ఎత్తున నష్టపరిహారం ప్రకటించినా.. అరకొరగా ఇచ్చి సరిపెట్టారు. కంపెనీ నుంచి రావాల్సిన పరిహారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే.. వారికి రావాల్సిన పరిహారం విషయాన్ని ఎల్జీ పాలిరమర్స్ కంపెనీ యాజమాన్యంతో చర్చించి.. విడుదలకు హామీ తీసుకున్నారు. మొత్తంగా ఇంకా రూ. 120 కోట్ల రూపాయలను పరిహారంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో సగం నేరుగా బాధితుల ఖాతాల్లోకి వారికి జరిగిన నష్టాన్ని బట్టి జమ చేశారు .
మిగతా సగంతో విద్య, వైద్య వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతానికి ఎల్జీ పాలిమర్స్ ను విశాఖ శివారు ప్రాంతాం నుంచి తొలగించారు. శ్రీసిటీలో పరిశ్రమను ఏర్పాటు చేశారు. గ్రామం మధ్యలో రసాయన పరిశ్రమ ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎల్జీ మరో పరిశ్రమను స్థాపించే అవకాశాలు ఉన్నాయి. బాధితులకు పరిహరం కోసం.. జగన్ రెడ్డి హయాంలో ..ఎన్నో సంస్థలు పోరాటం చేశాయి. కానీ ప్రభుత్వం అందర్నీ అణచి వేసింది.
ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు తనిఖీల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు పిండుకున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగా ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు సహజంగా మారాయి. ఇటీవల .. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి.. రసాయన ప రిశ్రమల్లో జాగ్రత్తల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసింది. సోదాలు కూడా ప్రారంభించడంతో ఫార్మా కంపెనీల యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.