తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే కళ్లకు అద్దుకొని తింటారు. వెంకన్న దర్శనం అంటే ఎంత భాగ్యమో… ప్రసాదాన్ని కూడా అంతే గౌరవంగా చూస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కొంతకాలంగా గత వైసీపీ పాలనలో దోపిడీ జరిగిందన్న అంశానికి తోడు ఇప్పుడు హిందువులంతా కలియుగ దైవంగా భావించే వెంకన్నను వదల్లేదా అన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
నిజానికి ఈ ఇష్యూ ఇంత పెద్దగా అవుతుందని వైసీపీ ఊహించలేదు. అందుకే సీఎం చంద్రబాబు ఆరోపణలు చేసిన మరుసటి రోజు ఉదయం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… మాజీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాతే ప్రెస్ మీట్ పెట్టి మరీ నేను ఎలాంటి ప్రమాణం చేయటానికైనా రెడీ అంటూ సవాల్ విసిరారు. దీంతో చంద్రబాబు చేసింది రాజకీయ విమర్శయేనా? వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తానంటున్నారు కదా ? అని అంతా అనుకున్నారు.
కానీ, సాయంత్రానికి టీడీపీ ఆధారాలు కూడా విడుదల చేసింది. దేశంలోనే నమ్మదగిన డెయిరీ ల్యాబ్స్ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయటంతో అంతా అవాక్కయ్యారు. ఈ ఐదు సంవత్సరాల్లో నాణ్యత తగ్గిందని బాధపడ్డాం కానీ అసలు మోసం ఇదా? ఇంత మోసం ఉంటుందా? హద్దూ అదుపులేని అవినీతి అంటూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ట్విట్టర్ ( ఎక్స్)లో తిరుపతి లడ్డూ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ఆధారాలు విడుదల చేసిన తర్వాత వైసీపీ నుండి ఎవరూ మాట్లాడే సహసం చేయలేదు.
దీంతో స్వయంగా మాజీ సీఎం జగన్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 3గంటలకు జగన్ మీడియా ముందు మాట్లాడబోతున్నారు.