తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ చేయడం తప్పు కాదు కానీ అలా బయట పెట్టడం మాత్రం.. హిందూ ధర్మానికి తూట్లు పొడవడమే.. భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీయమేనట. జగన్ రెడ్డి ఎంతో కష్టపడి రాసుకొచ్చిన దాన్ని చదివినది విన్న తర్వాత .. సారాంశం అందరికీ స్ఫూరిస్తుంది. దేశవ్యాప్తంగా జగన్ రెడ్డిపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతూండటం బీజేపీ నేతలు కూడా ఘాటు కామెంట్లు చేస్తూండటంతో మీడియా ముందుకు వచ్చారు. ఎప్పట్లానే స్పీచ్ తెచ్చుకున్నారు. మధ్యలో స్లిప్పులివ్వడానికి ఓ టీంను పక్కన రెడీగా పెట్టుకున్నారు. అయినా తిరుమలలో తన హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని చెప్పలేదు.
నెయ్యి కల్తీ జరిగిదంని తేలిస్తే రెండు నెలల తర్వాత ఎందుకు చెప్పారని ఆయన ప్రశ్న. జగన్ రెడ్డి అతి తెలివి ఇక్కడే బయటపడింది. అప్పుడే కంపెనీల్ని బ్లాక్ లిస్టులో పెట్టి .. వాటి నుంచి నెయ్యి తీసుకోవడం ఆపేశారు. మళ్లీ నందిని బ్రాండ్ నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. అప్పుడే బయట పెట్టారు. ఇప్పుడు తమ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు కాబట్టి సంచలనం అయింది. కామెడీ ఏమిటంటే.. టీటీడీ చేసిన ఇతర పనులన్నీ వైసీపీ చేసిందని చెప్పుకున్నాడు. గుళ్లు వైసీపీ కట్టించిందట.. నవనీత సేవ తెచ్చిందట.. ఇలా చాలా చెప్పుకున్నారు. శ్రీవాణి పేరుతో భ క్తుల్ని దోచుకున్న విషయం మాత్రం.. చెప్పుకోలేదు.
జగన్ రెడ్డి టీటీడీ వి,యంలో ఘోరమైన తప్పిదాలు చేశాడు. అర్హత లేకపోయినా ఐఏఎస్ కాకపోయినా ధర్మారెడ్డికి ఐదేళ్లపాటు టీటీడీపై పెత్తనం ఇచ్చారు. సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని చైర్మన్లుగా చేశారు. శ్రీవారిని మార్కెటింగ్ టూల్ గా చేసుకుని న్యాయమూర్తుల ఇళ్లకు ప్రసాదాలను కూడా పట్టుకోపాయరన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన చేసిన నిర్వాకాలు ముందు ముందు ఇంకా చాలా బయటకు వస్తాయి. అప్పుడు కూడా.. ఇదంతా డైవర్షన్ అని చెప్పుకుని గగ్గోలు పెట్టడం తప్ప చేయగలిగిందేమీ లేదు.