తిరుమల లడ్డూ విషయంలో ఏర్పడిన వివాదంపై పవన్ కల్యాణ్ స్పందించిన వైనం హిందూ సమాజంలో చర్చకు దారి తీసింది. ఆయన రాజకీయ నాయుకుడు కాబట్టి కచ్చితంగా ఆ స్పందనలో రాజకీయ కోణం చూస్తారు. పవన్ స్పందనలో రాజకీయం ఉందో లేదో కానీ.. హిందూవాదుల అభిమానాన్ని పొందుతున్నారు. అలాగే.. బీజేపీ వ్యతిరేకుల విమర్శలనూ ఎదుర్కొంటున్నారు. పవన్ ట్వీట్ ను వ్యతిరేకిస్తూ… ప్రకాష్ రాజ్ తెర ముందుకు వచ్చారు. పవన్ అధికారంలో ఉన్నారని చర్యలు తీసుకోవాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు.
We are all deeply disturbed with the findings of animal fat (fish oil,pork fat and beef fat )mixed in Tirupathi Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP Govt then. Our Govt is committed to take stringent action possible.
But,this throws… https://t.co/SA4DCPZDHy— Pawan Kalyan (@PawanKalyan) September 20, 2024
కానీ ప్రకాష్ రాజ్‌కు తెలియదో..తెలియనట్లుగా నటిస్తున్నారో కానీ ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. పవన్ కల్యాణ్ సమస్య విస్తృతిని అర్థం చేసుకుని శాశ్వత పరిష్కారం కోసం.. ఓ సూచనలు చేశారు. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఉండాలని పవన్ కోరుకోవడం ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లకు నచ్చలేదమో కానీ సనాతన ధర్మాన్ని కోరుకునేవరందరికీ నచ్చింది. దీనిపై ఆయన చర్చకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, హిందూ మఠాధిపతులు, న్యాయ, పౌర, మీడియా సమాజంతో పాటు ఇతర వర్గాలన్నీ ఈ చర్చలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగే వాటిని ఏ రూపంలో అయినా సరే అడ్డుకోవాల్సిందేనని పవన్ భావన
పవన్ కల్యాణ్ స్పందన ఇప్పుడు వైరల్ అవుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నా లేకపోయినా ఆయన.. సనాతన ధర్మంపై ఒకే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు తిరుమల వివాదం తర్వాత మరింత క్లారిటీగా తెర ముందుకు వచ్చారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆయన కోరడం… ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. సమాజానికి హాని అంత కన్నా కాదు. కానీ ప్రకాష్ రాజ్ లాంటి వారికి మాత్రం నచ్చదు. అలాంటి వారు పరిమితంగానే ఉంటారు. హిందువులంతా స్వాగతిస్తారు.