కళా పోషకురాలు అయిన దివ్వెల మాధురీ తన రాజా దువ్వాడ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా ను నిర్మించారు. ఆ సినిమా పేరు వాలంటీర్. క్యాచీగా ఉన్న టైటిల్ గా .. నిలువు బొట్టుతో కాస్త విలన్ సత్యప్రకాష్ లా కనిపించే దువ్వాడ శ్రీనుకు హీరోగా మేకప్ వేసి సినిమా తీశారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారో కానీ.. దువ్వాడ నటా కళా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చే కొన్ని బిట్లను సోషల్ మీడియాలో లీక్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దవ్వాడ డైలాగులు, ఫైట్లు రఫ్పాడిస్తున్నారని చెప్పుకునేలా వాటిని తీర్చిదిద్దారు. టేకింగ్ .. స్లోమోషన్ ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా మొత్తం దువ్వాడ ఎమోషన్ ను తన భుజాలపై మోసినట్లుగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మాత్రం అదుర్స్ అన్నట్లుగా ఉన్నాయి. దివ్వెల మాధురీనే ఈ సినిమాను నిర్మాత కావడంతో ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు కూడా చెప్పడం కష్టం. ఖర్చుకు వెనుకాడకుండా .. తన రాజాను ఆమె స్క్రీన్ పై రాజాలాగా ప్రజెంట్ చేయించేందుకు ప్రయత్నించి ఉంటారు.
ఈ సినిమాలో హీరోయినా ఉన్నారా.. ఉంటే ఆ హీరోయిన్ దివ్వెల మాధురీనేనా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి దివ్వెల మాధురీ హీరోయిన్ ఎలివేషన్ వీడియోలు చాలా వచ్చాయి. బహుశా అవన్నీ ఈ సినిమాలోవేనని కొంత మందికి డౌటనుమానాలు వస్తున్నాయి. మొత్తంగా వాలంటీర్ సినిమాలో దువ్వాడ – దివ్వెల జంట…మరోసారి వైరల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.