తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి క‌ల్తీ… స్పందించిన రాహుల్ గాంధీ

తిర‌మల వెంక‌న్న ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యి క‌ల్తీ అయ్యింద‌ని, అందులో జంతువుల కొవ్వు అవ‌శేషాలున్న‌ట్లు తేల‌టంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. ఈ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుంది.

తాజాగా ఈ అంశంపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. తిరుప‌తి బాలాజీ అంటే ప్ర‌పంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడు. శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌విత్ర‌మైంద‌న్న వార్త‌లు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇది ప్ర‌తి భ‌క్తుడిని బాధ‌పెడుతోంది. తిరుమ‌ల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న దేవాల‌యాల ప‌విత్ర‌త కాపాడాల్సిన అవ‌స‌రం ఉంది అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇదే విష‌యంపై మాజీ ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు సైతం సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడారు. భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌ని, ఎంతో ప‌విత్రంగా భావించే తిరుమ‌ల ల‌డ్డూ నెయ్యి కల్తీపై చ‌ర్య‌లు తీసుకోవ‌టంతో పాటు భ‌విష్య‌త్ లో ఇలాంటివి పున‌రావృతం కాకుండా చూడాలని ఆయ‌న సూచించారు.

ఇక దీనిపై కేంద్ర ఇంట‌లిజెన్స్ వ‌ర్గాలు కూడా ఫోక‌స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ కల్తీ: ప్రకాష్ రాజ్ × మంచు విష్ణు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ వివాదంపై హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్‌రాజ్‌ మధ్య...

లారెన్స్ తో ముగ్గురు హీరోయిన్లు

డాన్స్ మాస్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌మ్ హీరో.. లారెన్స్ జోరు పెంచారు. ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ఆయ‌న ప‌ట్టాలెక్కిస్తున్నారు. 'బెంజ్‌' అనే సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇటీవ‌లే ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కత్వంలో...

ఈ వీకెండ్ లో హైడ్రా దూకుడు ఎక్క‌డో…!

వీకెండ్ వ‌చ్చిందంటే చాలు... హైడ్రా బుల్డోజ‌ర్స్ వ‌చ్చేస్తున్నాయి. ఎక్క‌డో ఒక చోట కూల్చివేత‌లు జ‌రుగుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా హైడ్రా త‌న స్పీడ్ త‌గ్గించింది. అయితే, తెలంగాణ మంత్రివ‌ర్గంతో పాటు సుప్రీంకోర్టు...

ఎన్టీఆర్ కి క‌థ చెప్పేశాడా?

'వెట్రిమార‌న్ నా అభిమాన ద‌ర్శ‌కుడు. త‌న‌తో ఓ సినిమా చేయాల‌ని వుంది' అంటూ ఇటీవ‌ల 'దేవ‌ర‌' ప్ర‌మోష‌న్ల‌లో ఎన్టీఆర్ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా సినిమా హీరోలు ప్ర‌మోష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close