ఎన్టీఆర్ కి క‌థ చెప్పేశాడా?

‘వెట్రిమార‌న్ నా అభిమాన ద‌ర్శ‌కుడు. త‌న‌తో ఓ సినిమా చేయాల‌ని వుంది’ అంటూ ఇటీవ‌ల ‘దేవ‌ర‌’ ప్ర‌మోష‌న్ల‌లో ఎన్టీఆర్ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా సినిమా హీరోలు ప్ర‌మోష‌న్ కోసం వేరే రాష్ట్రం వెళ్లిన‌ప్పుడు అక్క‌డి మీడియా, సినిమా వాళ్ల అటెన్ష‌న్ పొంద‌డానికి ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. అయితే ఎన్టీఆర్ కోరిక‌ను ఈ జాబితాలో క‌ల‌ప‌లేం. ఎందుకంటే నిజంగానే వెట్రిమార‌న్ తో సినిమా చేయాల‌ని ఎన్టీఆర్ కి ఉంది. వెట్రిమార‌న్ కూడా ఎన్టీఆర్ కోసం ఓ క‌థ రెడీ చేశారు. ఆమ‌ధ్య ఎన్టీఆర్ కి కూడా వినిపించిన‌ట్టు తెలుస్తోంది. వెట్రిమార‌న్ కూడా ‘ఎన్టీఆర్‌ని క‌లిశాను. ఓ క‌థ చెప్పా. త్వ‌ర‌లోనే మా కాంబో ఉంటుంది’ అని ప్ర‌క‌టించారు. సో… ఇది కేవ‌లం ప్ర‌మోష‌న్ చెప్పింది కాదు. ఈ కాంబో ఆల్రెడీ ఆన్‌లోనే ఉంది.

‘దేవ‌ర’ త‌ర‌వాత ప్ర‌శాంత్ నీల్ సినిమా మొద‌లెట్టాలి ఎన్టీఆర్‌. అక్టోబ‌రు 21 నుంచి ప్ర‌శాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. 40 రోజుల పాటు జ‌రిగే తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొన‌డం లేదు. జ‌న‌వ‌రి నుంచి మ‌రో షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. ఎన్టీఆర్ కూడా అప్పుడే సెట్లో అడుగు పెట్ట‌నున్నారు. ప్ర‌శాంత్ నీల్ సినిమా పూర్త‌యిన వెంట‌నే ‘దేవ‌ర 2’ని మొద‌లెడ‌తారు. ఆ త‌ర‌వాతే… వెట్రిమారన్ సినిమా ఉంటుంది. ఈలోగా వెట్రిమార‌న్ ఓ సినిమా పూర్తి చేస్తారు. ఈనెల 27న ‘దేవ‌ర‌’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే యేడాది ‘వార్ 2’ విడుద‌ల అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ ఫర్నీచర్ ఎప్పుడు తిరిగిస్తారు ?

తిరుమల లడ్డూ వివాదంపై జగన్ రెడ్డి పెట్టిన ప్రెస్మీట్ చూసిన వారికి..గతంలో ఆయన సీఎంగా పెట్టిన ప్రెస్మీట్లు చూసిన వారికి పెద్ద తేడా కనిపించదు. ఎందుకంటే అప్పుడు ఏ సమావేశ మందిరంలో...

జ‌న‌సేన‌లో చేరిక‌ల జోరు… ఈనెల 26న ముహుర్తం!

జ‌న‌సేన పార్టీలోకి చేరిక‌ల జోరు పెరుగుతోంది. వైసీపీ నేత‌ల చూపంతా ఇప్పుడు జ‌న‌సేన పార్టీ వైపే ఉంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ప‌రిస్థితులు, పార్టీలో ఉన్న నేత‌ల‌ను బ‌ట్టి చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో...

పంత్‌ సెంచరీ.. చాలా ప్రత్యేకం

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ సెంచరీ కొట్టాడు. 128 బంతుల్లో109 పరుగులు సాధించాడు. ఈ శతకం పంత్ కి చాలా స్పెషల్. భారత్‌...

ఒకే వేదిక‌పై రేవంత్ – కేటీఆర్… ఈసారి కుద‌ర్లేదు!

ఉప్పూ-నిప్పులా ఉండే నేత‌లు ఒకే వేదిక‌పై క‌నిపిస్తే...? అది కూడా రాజ‌కీయంగా తీవ్ర వైరుధ్య‌మున్న సీఎం రేవంత్ రెడ్డి- కేటీఆర్ లు క‌లిసే...? అంద‌రూ ఇదే ఆస‌క్తిగా ఎదురుచూశారు. సీపీఎం నేత సీతారాం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close