తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ వివాదంపై హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్‌రాజ్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధాని తెర లేచింది.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రకాశ్‌రాజ్ ఓ పోస్ట్ పెట్టారు. ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు సృష్టించి జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే మనదేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. #జస్ట్ ఆస్కింగ్’ అని పోస్ట్ పెట్టారు.
Sri @prakashraaj , please clam the heck down. The Tirumala Laddu is not just prasadam, it’s a symbol of faith for millions of Hindus like me. Sri @PawanKalyan, the Deputy CM, has rightly called for thorough investigation and action to ensure the protection of such sacred… https://t.co/K2SSZUuIJe
— Vishnu Manchu (@iVishnuManchu) September 21, 2024
దీనికి ‘మా’ అధ్యక్షుడిగా వున్న మంచు విష్ణు తనదైన శైలి స్పందించారు. ‘ప్రకాశ్‌రాజ్ డిస్సాపాయింట్ అవ్వకండి. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. కోట్లాది హిందువుల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో?’ అని ప్రశ్నించారు. మరి విష్ణు ప్రశ్నకు ప్రకాష్ ఏమని బదిలిస్తారో చూడాలి.
ఇదీలావుంటే..శ్రీవారి లడ్డూ కల్తీపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై సమావేశంలో చర్చిస్తున్నారు.