బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ సెంచరీ కొట్టాడు. 128 బంతుల్లో109 పరుగులు సాధించాడు. ఈ శతకం పంత్ కి చాలా స్పెషల్. భారత్ తరఫున వికెట్ కీపర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో ధోనీని పంత్ సమం చేశాడు. ధోనీ 144 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలు చేయగా.. పంత్ మాత్రం 58 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు.
రికార్డులు పరంగానే కాదు.. ఈ సెంచరీ పంత్ పునరాగమనంకు గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చింది. కొన్నేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు పంత్. చాలా రోజుల పాటు మంచానికే పరిమితమయ్యాడు. తను వున్న కండీషన్ లో అతడు మళ్ళీ ఎప్పుడు నడుస్తాడో అనుకున్నారంతా. త్వరగా కోల్కొవాలని ప్రార్ధనలు చేశారు. కోలుకున్నప్పటికీ మళ్ళీ మైదానంలో రాణించగలడా అనే సందేహాలు.
ఆటగాళ్ళుకి చిన్న చిన్న గాయాలే కెరీర్ కి పుల్ స్టాప్ పడేలా చేసేస్తాయి. అలాంటింది పంత్ కి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. మల్టిఫుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. అయితే తన విల్ పవర్ తో మళ్ళీ మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ లో ఢిల్లీకి సారధ్యం వహించాడు. అదే దూకుడు చూపించాడు.
అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ డిఫరెంట్ బాల్ గేమ్. అందులో టెస్ట్ క్రికెట్ అసలు సిసలైన ఆటకి పరీక్ష. అలాంటి టెస్ట్ క్రికెట్ లో మళ్ళీ సెంచరీ కొట్టి.. అంతర్జాతీయ మ్యాచులు ఆడేందుకు తను వందశాతం ఫిట్ గా వున్నాని చాటి చెప్పాడు పంత్.
ఇక ఈ మ్యాచ్ విషయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ఎదుట 515 పరుగులను టార్గెట్‌గా నిర్దేశించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.