తిరుమల లడ్డూ వివాదంపై జగన్ రెడ్డి పెట్టిన ప్రెస్మీట్ చూసిన వారికి..గతంలో ఆయన సీఎంగా పెట్టిన ప్రెస్మీట్లు చూసిన వారికి పెద్ద తేడా కనిపించదు. ఎందుకంటే అప్పుడు ఏ సమావేశ మందిరంలో మాట్లాడారో ఇప్పుడూ అక్కడే మాట్లాడారు. అంటే అప్పటి సీఎం క్యాంప్ ఆఫీసును ఆయన ఇప్పుడు పార్టీ ఆఫీసుగా వాడుకుంటున్నారు. మరి అందులో ఉన్న ఫర్నీచల్.. ఆ మైకులు.. అన్నీ ఎవరివి ..?. వంద శాతం ప్రజాధనంతో కొనుగోలు చేసినవి. అంటే ప్రభుత్వానివి ప్రజలవి.
జగన్ రెడ్డి తన మొండిగోడల ఇంటికి క్యాంప్ ఆఫీస్ అని పేరు పెట్టుకుని కనీసం రూ. వంద కోట్ల వరకూ ప్రజాధనం వెచ్చించి… సోకులు చేయించుకున్నారు. అత్యంత లగ్జరీ వస్తువులు, ఫర్నీచర్ తో పాటు.. ఇంటిచుట్టూ అతి భారీ ఇనుప గ్రిల్స్ పెట్టించుకున్నారు. ప్రతి ఖర్చు ప్రజలదే. చివరికి ఇంటికి కిటికీలు కూడా ప్రజాధనంతో కట్టించుకున్నారు. ప్రైవేటు ఇంటికి ఇలా ప్రజాధనంతో సోకులు చేయించుకునే రాజకీయనాయుకుడు జగన్ ఒక్కరే ఉంటారు. ఓడిపోయిన తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి కట్టడమే.. లేకపోతే ప్రజాధనంతో కొన్నవన్నీ తిరిగి ఇచ్చేయడమో చేయాలి. కానీ జగన్ రెడ్డి ఏ మాత్రం సిగ్గుపడకుండా వాడేసుకుంటున్నారు.
ప్రజాధనం విషయంలో జగన్ రెడ్డి తన సొంత ధనం అన్నట్లుగా ఉపయోగించుకుంటూ పోయారు. రెండు, మూడు కిలోమీటర్ల దూరానికి కూడా ఆయన హెలికాఫ్టర్ వాడేవారు. ప్రతి విషయంలోనూ లగ్జరీకిపోయేవారు. ఇప్పుడు కూడా అలా ప్రజాధనం నుంచి ఖర్చు పెట్టుకున్నది తిరిగి ఇవ్వాలన్న ఆలోచన చేయడంలేదు. ఫర్నీచర్ దొంగ అని టీడీపీ నేతలు ట్రోల్ చేస్తే.. కోడెల ఆత్మహత్య చేసుకున్నారు.. కానీ జగన్ రెడ్డి మాత్రం బ యటపడిన తర్వాత కూడా నింపాదిగా ఉంటున్నారు. ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే కక్షసాధింపులు అని ఏడవొచ్చు అని అయన ప్లాన్.