ముఖ్యమంత్రి తీరిక లేకుండా ఉంటారు. ఆయన అన్ని విషయాలను పట్టించుకోవడం కష్టం. కానీ చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నా.. ఓ మూడేళ్ల బాలుడి విషయంలో పది రోజుల పాటు ఫాలో అప్ చేసి మరీ ప్రాణం కాపాడారు. మొత్తం కోలుకున్న తరవతా .. వాళ్లు చెబితే తప్ప ఈ విషయం బయటకు తెలియలేదు.
విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన ఓ మహిళకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఒంటరి తల్లి. ఆమె బిడ్డకు టైఫాయిడ్ వచ్చింది. ఎంతకూ తగ్గలేదు. చివరికి ఆస్పత్రికి తీసుకెళ్తే ఇక బతకడం కష్టమని.. ప్లేట్లెట్స్ పడిపోయాయని .. ఇంటికి తీసుకెళ్లిపోవాలని చెప్పారు. దీంతో ఆ తల్లి మెరుగైన వైద్యం చేయించాలని అర్థించేందుకు లోక్ ప్రజాదర్భార్ కు వచ్చారు. ఆ రోజు ప్రజాదర్బార్ లేదు. అయినా సెక్యూరిటీ సిబ్బంది వివరాలు తీసుకుని చంద్రబాబు సిబ్బందికి చెప్పారు. విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు… ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డను కాపాడాలని ఆదేశాలు జారీ చేశారు.
నిమిషాల్లో అప్రమత్తమైన వైద్య బృందం ఆ పిల్లవాడి ఇంటికి వెళ్లారు. ప్రత్యేక చికిత్సా ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూర్తిగా ఆశలు వదిలేసుకున్న పరిస్థితుల్లో వైద్యం ప్రారంభించిన వైద్యులు.. పదకొండు రోజులకు సాధారణ స్థితికి తీసుకురాగలిగారు. ఎంత బిజీగా ఉన్నా.. చంద్రబాబు ఈ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని రోజూ ఫాలో అప్ చేశారు.
మంచి మనసుతో ఆ భావి పౌరుడ్ని కాపాడేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం సఫలమయింది. తమ బిడ్డకు పునర్జన్మ ఇచ్చినందుకు ఆ బిడ్డ తల్లి బంధువులు లోకేష్, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వచ్చినా.. నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు లోకేష్,చంద్రబాబు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు.