రివర్స్ టెండర్లకు అత్యంత తక్కువ ధరకు కాంట్రాక్టులు తీసుకున్న వారికి గట్టి షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. కాంట్రాక్టులు రద్దు చేయడం కాదు. అత్యంత క్వాలిటీతో రాజీ పడకుండా… పాడుకున్న ధరలకే చేసుకున్న ఒప్పందం ప్రకారం కట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం విషయంలో అతి తక్కువ ధరలకు కట్టేందుకు గతంలో మేఘా రివర్స్ టెండర్లేసింది. కాంట్రాక్టర్ గా మారింది.
అయితే ఐదేళ్లలో పనులు చేసిందేమీ లేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ ను మారిస్తే మరింత ఆలస్యం కావడంతో పాటు అనేక చిక్కులు వస్తాయి. కొత్త కాంట్రాక్టర్లు ఎవరూ తక్కువ ధరకు చేయరు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు మేఘాతోనే కట్టించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కూడా అదే సిఫారసు చేసింది. రెండు వైపుల నుంచి క్వాలిటీ చెక్ ఉండేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు.
జగన్ రెడ్డి హయాంలో పోలవరమే కాదు.. దాదాపుగా అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండర్లేశారు. అన్నీ మేఘానో.. మేఘా కు సంబంధించిన కంపెనీలో తక్కువ ధరలకు దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నింటినీ అంచనాలు పెంచుకండా మేఘాతోనే పూర్తి చేయించాలని భావిస్తున్నారు. అదే జరిగితే మేఘాకు భారీ నష్టాలు వస్తాయి. జగన్ రెడ్డిని నమ్మినందుకు ఆ సంస్థకు ఆ మాత్రం జరగాల్సిందేనన్న భావన కాంట్రాక్టర్లలోనూ వ్యక్తమవుతోంది.