రాజకీయ నేతలందరూ ఓ ప్రిన్సిపుల్ ఫాలో అవుతారు. తాము చేసే తప్పుడు పనులు, వివాదాస్పద అంశాలు బయటపడినప్పుడు… తూచ్ అనేందుకు ఓ దారిని ఉంచుకుంటారు. కానీ జగన్ రెడ్డి స్టైల్ వేరు. ఆయన రాజకీయం చెట్టు కొట్టి మీదేసుకున్న స్టైల్లో ఉంటుంది. తిరుపతి లడ్డూ వివాదంలో ఏకైక విలన్గా జగన్ రెడ్డి నిలబడ్డారు. దానికి కారణం ఆయనే. కల్తీ చేయడమే కాదు… తానే చేశానన్నట్లుగా ఎదురుగా వచ్చి పెట్టిన ప్రెస్మీట్ వల్ల ఆయన మరింత బ్యాడ్ అయిపోయారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీతి ఎలా చూసుకుంటానని.. టీటీడీకి బోర్డు ను ఏర్పాటు చేశామని అది స్వతంత్రంగా పని చేస్తుందని వాదించవచ్చు. అప్పట్లో తప్పు జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పవచ్చు. కానీ జగన్ రెడ్డి అంతా మీదేసుకున్నట్లుగా ప్రకటనలు చేశారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. జగన్ రెడ్డి రాజకీయం ఎలాంటిదో అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన నిజంగా చేశారన్న అభిప్రాయం జగన్ రెడ్డి వాదన ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లింది.
కల్తీ నెయ్యి వ్యవహారం జగన్ రెడ్డికి తెలిసి జరిగిందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఈ విషయంలో నేరుగా ఆయనను నిందితుడ్ని చేయలేరు. తప్పు ఆయనదని చెప్పలేరు. కానీ సీఎంగా ఉండి పర్యవేక్షణ చేయకపోవడం ఆయన తప్పే. అవినీతిని ప్రోత్సహించడం తప్పే అవుతుంది. అయిదే నేరుగా ఈ నింద తన పార్టీపై పడకుండా చేసుకునే అవకాశం వచ్చినా ఆయన … కావాలనే మీదేసుకున్నారు. టీటీడీ అనే స్వతంత్రంగా వ్యవహరించే సంస్థ అని ఆ సంస్థ వ్యవహారాలకు తమను నిందించడం ఎందుకని ఆయన ఎదురుదాడికి దిగవచ్చు. కానీ.. భిన్నమైన పసలేని వాదనతో… ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.