టీడీపీ తరపున ఢిల్లీలో చక్కబెట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ నారా లోకేష్ చక్కబెడుతున్నారు. ఆదివారం ఆయన ఢిల్లీకి వెళ్లారు. పలువురు కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఇదంతా రాజకీయ పర్యటనే. మమూలుగా అధికారిక పర్యటన అయితే వీక్ డేస్ లో వస్తారని ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారని అంటున్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయాన్ని లోకేష్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిపై బీజేపీ పెద్దలతో కొన్ని చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఖాళీ అయిన రాజ్యసభ సీట్లు.. కాబోతున్న సీట్లు.. ఎమ్మెల్సీ సీట్లు సహా మొత్తం ఓ పద్దతిగా భర్తీ చేసేందుకు ఈ చర్చలు ఉపయోగపడనున్నాలు. అలాగే లడ్డూ వివాదం నేపధ్యంలో రాజకీయంగా జగన్ ను ఎలా కార్నర్ చేయాలన్నదానిపైనా వ్యూహాన్ని ఖరారు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకల విషయంలో సీరియస్ గా వర్కవుట్ చేస్తోంది నారా లోకేషే. వదిలి పెట్టే ప్రశ్నే లేదని అంటున్నారు. ఇప్పటికి జెత్వానీ కేసు.. ఇప్పుడు లడ్డూ కేసు.. తర్వాత మద్యం స్కాం సంచలనం సృష్టించబోతోందని ఆయన చెప్పారు. ఈ స్కామ్ ను మరింత బిగ్గరగా జాతీయ స్థాయిలో ఎక్స్ పోజ్ చేసేలా లోకేష్ ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో మరింత ఎక్కువగా వైసీపీ నిర్వాకాలు ప్రజల్లో చర్చకు రానున్నాయి.